Tuesday, May 12, 2026
E-PAPER
Homeఆటలునేనేమీ సన్యాసం తీసుకోను!

నేనేమీ సన్యాసం తీసుకోను!

- Advertisement -


రెజ్లింగ్‌ సమాఖ్యపై వినేశ్‌ ఫోగట్‌ ఫైర్‌
గోండా (ఉత్తరప్రదేశ్‌) :
భారత రెజ్లింగ్‌ ‌సమాఖ్య (డబ్ల్యూఎఫ్‌ఐ) తీరుపై స్టార్‌ ‌రెజ్లర్‌ ‌వినేశ్‌ ‌ఫోగట్‌ ‌మండిపడింది. ఈ ఏడాది జనవరి నుంచి కుస్తీ బరిలోకి దిగేందుకు ఇంటర్నేషనల్‌ ‌టెస్టింగ్‌ ఏజెన్సీ (ఏటీఏ) అనుమతి ఇచ్చినా.. వాడా, నాడా రూల్స్ అంటూ రీ ఎంట్రీని అడ్డుకునేందుకు రెజ్లింగ్‌ ఫెడరేషన్‌ ‌కుట్రలు పన్నుతోందని వినేశ్‌ ‌ఫోగట్ ఆరోపించారు. జూన్‌ 26 వరకు వినేశ్‌ ‌ఫోగట్‌ ‌పోటీపడేందుకు అవకాశం లేదంటూ ఆమెకు రెజ్లింగ్‌ ‌ఫెడరేషన్‌ ‌షోకాజ్‌ ‌నోటీసు జారీ చేసిన సంగతి తెలిసిందే. షోకాజ్‌ ‌నోటీసుకు బదులిచ్చిన వినేశ్‌ ‌ఫోగట్‌ ఉత్తరప్రదేశ్‌‌లోని గోండాలో జరుగుతున్న జాతీయ సీనియర్‌ ఓపెన్‌ ‌చాంపియన్‌‌షిప్స్‌‌కు వచ్చింది. షోకాజ్‌ ‌నోటీసులకు సమాధానం ఇచ్చాను, ఐటీఏ అనుమతి ఉందంటూ పోటీకి అనుమతించాలని నిర్వాహకులను కోరింది. రెజ్లింగ్‌ ‌సమాఖ్య అధ్యక్ష‍ుడు సంజయ్‌ ‌సింగ్‌‌తో మాట్లాడిన అనంతరం వినేశ్‌ ‌ఫోగట్‌ ‌మీడియా ముందుకొచ్చింది. ‘నేను కుస్తీ బరిలోకి మళ్లీ అడుగుపెట్టకుండా రెజ్లింగ్‌ ఫెడరేషన్‌ ‌కుట్ర చేస్తోంది. నేను రెజ్లింగ్‌ ‌నుంచి సన్యాసం తీసుకోవాలని వారు అనుకుం టున్నారు. అది జరుగదు. నేను మళ్లీ మల్లయుధ్దంలో పోటీప డతాను. మరోసారి ప్రయత్నం చేస్తాను’ అని వినేశ్‌ ‌పోగట్‌‌ తెలిపింది. రిటైర్‌‌మెంట్‌ ‌ప్రకటించిన అథ్లెట్లు కనీసం ఆరు నెలల నోటీసు లేకుండా నేరుగా పోటీపడలేరని వినేశ్‌ ‌ఫోగట్‌ ‌రీ ఎంట్రీకి భారత రెజ్లింగ్‌ ‌సమాఖ్య నిరాకరించిన సంగతి తెలిసిందే. 2026 ఆసియా క్రీడల్లో పోటీపడేం దుకు వినేశ్‌‌ ఫోగట్‌ ‌ప్రణాళికలు సిద్ధం చేసుకోగా.. అందుకు వీలు లేకుండా సెలక్ష‍న్‌ ‌ట్రయల్స్‌ ‌రూల్స్‌‌ను సైతం రెజ్లింగ్‌‌ సమాఖ్య కఠినతరం చేసింది.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -