బరిలో సాత్విక్, చిరాగ్ జోడీ
నేటి నుంచి థాయ్‌లాండ్ ఓపెన్
బ్యాంకాక్ (థాయ్‌లాండ్) : ఇటీవల థామస్ కప్‌లో కాంస్య పతకం సాధించిన భారత షట్లర్లు.. ఆ జోరు థాయ్‌లాండ్ ఓపెన్‌లో పునరావృతం చేయాలని ఎదురుచూస్తున్నారు. యువ షట్లర్లు లక్ష్యసేన్, ఆయుష్ శెట్టిలు థామస్‌కప్‌లో అద్భుతంగా రాణించారు. భుజం గాయంతో సెమీఫైనల్‌కు లక్ష్యసేన్ దూరమైనా.. ఇప్పడు పూర్తి ఫిట్‌నెస్ సాధించాడు. ఏడో సీడ్ లక్ష్యసేన్ థాయ్‌లాండ్ ఓపెన్ పురుషుల సింగిల్స్‌లో తొలి రౌండ్లో సింగపూర్ షట్లర్‌ను ఢీకొట్టనున్నాడు. ఆయుష్ శెట్టికి తొలి రౌండ్లో బలమైన ప్రత్యర్థి, ఆరో సీడ్ కొడాయ్ నరొక (జపాన్)ను ఎదుర్కొనున్నాడు. మాజీ వరల్డ్ నం.1 కిదాంబి శ్రీకాంత్ వరుసగా నిరాశపరుస్తున్నాడు. థాయ్‌లాండ్ ఓపెన్‌లో మెరుగైన ఫలితాలను ఆశిస్తూ శ్రీకాంత్ బరిలోకి దిగుతున్నాడు. తెలుగు తేజం తరున్ మానెపల్లి సైతం బరిలో నిలిచాడు.
మహిళల సింగిల్స్‌లో పి.వి సింధు టైటిల్‌పై కన్నేసింది. ఉబర్ కప్‌లో భారత్‌ను ముందుండి నడిపించిన సింధు ఫిట్‌నెస్ పరంగా ఎంతో మెరుగైంది. మలేషియా ఓపెన్‌లో సెమీఫైనల్, ఇండోనేషియా ఓపెన్‌లో క్వార్టర్‌ఫైనల్‌కు చేరుకున్న సింధు ఈ సీజన్లో తొలి టైటిల్‌పై కన్నేసింది. మహిళల సింగిల్స్‌లో ఉన్నతి హుడా, మాళవిక బాన్సోద్‌లు సైతం పోటీపడుతున్నారు. పురుషుల డబుల్స్‌లో సాత్విక్, చిరాగ్ శెట్టి సుదీర్ఘ విరామం అనంతరం రాకెట్ పడుతున్నారు. గాయం నుంచి కోలుకుని థామస్ కప్‌లో రాణించిన ఈ జోడీ.. థాయ్‌లాండ్ ఓపెన్‌తో టైటిల్ కరువు తీర్చుకోవాలని ఎదురుచూస్తున్నారు. హరిహరణ్, ఎంఆర్ అర్జున్‌లు బరిలో ఉన్నారు. మహిళల డబ్సుల్‌లో రుతుపర్ణ, శ్వేతపర్ణ జోడీ.. మిక్స్‌డ్ డబుల్స్‌లో రోహన్ కపూర్, రుత్విక శివాని.. ధ్రువ్ కపిల, తనీశ క్రాస్టోలు అదృష్టం పరీక్షించుకోనున్నారు. థాయ్‌లాండ్ ఓపెన్ నేటి నుంచి బ్యాంకాక్‌లో ఆరంభం కానుంది.
లక్ష్య, సింధు మెరిసేనా?
- Advertisement -
- Advertisement -


