Tuesday, May 12, 2026
E-PAPER
Homeజాతీయంసీఎం విజయ్ సంచలన నిర్ణయం

సీఎం విజయ్ సంచలన నిర్ణయం

- Advertisement -

నవతెలంగాణ – హైదరాబాద్ : తమిళనాడు ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించిన విజయ్ తన తొలి ప్రధాన పరిపాలనా నిర్ణయంతో సంచలనం సృష్టించారు. రాష్ట్రవ్యాప్తంగా దేవాలయాలు, విద్యాసంస్థలు, బస్టాండ్లకు సమీపంలో ఉన్న 717 ప్రభుత్వ మద్యం దుకాణాలను తక్షణమే మూసివేయాలని ఆయన ఆదేశాలు జారీ చేశారు. రెండు వారాల్లోగా ఈ ఆదేశాలను అమలు చేయాలని స్పష్టం చేశారు. ప్రభుత్వ గణాంకాల ప్రకారం తమిళనాడులో మొత్తం 4,765 టాస్మాక్ దుకాణాలు ఉన్నాయి. వీటిలో మూసివేయనున్న 717 షాపుల్లో.. 276 ప్రార్థనా స్థలాల దగ్గర, 186 విద్యాసంస్థల దగ్గర, 255 బస్టాండ్ల దగ్గర ఉన్నట్టు గుర్తించారు. సున్నితమైన ప్రాంతాల్లో మద్యం లభ్యతపై వస్తున్న ఆందోళనల నేపథ్యంలో ఈ సామాజిక సంస్కరణ చర్య చేపట్టినట్లు కొత్త ప్రభుత్వం పేర్కొంది.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -