- Advertisement -
- మున్సిపల్ చైర్మన్ డాక్టర్ కోడి శ్రీనివాసులు
నవతెలంగాణ- చండూరు
చండూరు మున్సిపాలిటీ పరిధిలో నిర్వహిస్తున్న బెల్ట్ షాపులను తొలగించాలని లేనియెడల కఠిన చర్యలు తప్పవని డాక్టర్ కోడి శ్రీనివాసులు హెచ్చరించారు. ఈ సందర్భంగా మంగళవారం మున్సిపల్ పాలకవర్గం సమావేశంలో మాట్లాడుతూ..మున్సిపాలిటీ పరిధిలో చాలామంది బెల్ట్ షాపులను నిర్వహిస్తున్నారని, బెల్ట్ షాపులు నిబంధనలకు విరుద్ధంగా నిర్వహించడం వల్ల మున్సిపాలిటీలో రోడ్డు ప్రమాదాలు, గొడవలు, కొట్లాటలు జరిగి శాంతి భద్రతలకు విఘాతం కలుగుతుందని అన్నారు. ఎక్సైజ్ అధికారులు, పోలీస్ శాఖ వారు బెల్ట్ షాపులపై నిఘా పెట్టాలని, నిర్వహించిన వారిపై కేసులు పెట్టి, జరిమానాలు విధించి, బైండోవర్లు చేయాలని అన్నారు.
చండూరు మున్సిపాలిటీ పరిధిలో చాలా వీధులలో బెల్ట్ షాపులు దర్శనమిస్తున్నాయని, ఉదయం 05:00 గంటల నుండి మద్యం సేవించి చాలామంది మద్యానికి బానిసలు అయ్యారని అన్నారు. మద్యానికి బానిస కాకుండా కుటుంబాలు, సమాజం బాగుండాలని మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి నిత్యం బెల్ట్ షాపుల నివారణకు పోరాటం చేస్తున్నారని గుర్తు చేశారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ వైస్ చైర్మన్ భూతరాజు దశరథ, కౌన్సిలర్లు కోడి సుష్మా వెంకన్న, తేలుకుంట్ల రాజకుమారి శేఖర్, కలిమికొండ పారిజాత జనార్ధన్, జెల్ల ధనమ్మ శ్రీనివాసులు,బుషిపాక వాసు, కటకం రమేష్, కొండ్రెడ్డి మధు, సామ సుజాత యాదవ రెడ్డి, కోఆప్షన్ సభ్యులు కల్లెట్ల చంద్రకళ మారయ్య, ఖలీల్, సలీమా షరీఫ్, మొగదాల వెంకన్న పాల్గొన్నారు.
- Advertisement -



