Tuesday, May 12, 2026
E-PAPER
Homeజిల్లాలురేపు స్ఫూర్తి శిఖరం పుస్తకావిష్కరణ 

రేపు స్ఫూర్తి శిఖరం పుస్తకావిష్కరణ 

- Advertisement -

– కామారెడ్డిలో సాహిత్య వేత్తల సమక్షంలో ఘనంగా నిర్వహణ
నవతెలంగాణ – కామారెడ్డి

తెలంగాణ రచయితల వేదిక (తెరవే) కామారెడ్డి జిల్లా ఆధ్వర్యంలో యువ రచయిత క్యారమ్ శ్యామ్ కుమార్ రచించిన “స్ఫూర్తి శిఖరం” పుస్తక ఆవిష్కరణ కార్యక్రమం బుధవారం సాయంత్రం 3 గంటలకు కామారెడ్డి పట్టణంలోని ఆర్‌కే డిగ్రీ పీజీ కళాశాలలో నిర్వహించనున్నట్లు నిర్వాహకులు తెలిపారు. ఈ కార్యక్రమానికి తెరవే రాష్ట్ర అధ్యక్షులు కొండి మల్లారెడ్డి, కామారెడ్డి జిల్లా గ్రంథాలయ చైర్మన్ మద్ది చంద్రకాంత్ రెడ్డి, బైండ్ల సుదర్శన్, అంబీర్ మనోహర్ రావు, జైపాల్ రెడ్డి, ప్రతాప్ రెడ్డి తదితరులు అతిథులుగా హాజరుకానున్నారు. సాహిత్య వేత్తలు, యువకులు, పుస్తకాభిమానులు సకాలంలో హాజరై కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని తెరవే జిల్లా అధ్యక్షుడు గఫూర్ శిక్షక్, ప్రధాన కార్యదర్శి మోహన్ రాజ్ ఒక ప్రకటనలో కోరారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -