ఒకరు మృతి, మరొకరికి తీవ్ర గాయాలు
నవతెలంగాణ – మల్హర్ రావు
మండలంలోని నాగులమ్మ క్రాస్ వద్ద మంగళవారం ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. మంథని నుండి కాటారం వెళ్తున్న ఇసుక లారీ, కాటారం నుండి మంథని వైపు వస్తున్న బొగ్గు టిప్పర్ ఎదురుగా ఢీకొన్నాయి. ఈ ప్రమాదంలో రెండు లారీల క్యాబిన్ లు నుజ్జునుజ్జుయ్యాయి. డ్రైవర్ శ్రీనివాస్ (46) అక్కడికక్కడే మృతి చెందగా, మరో డ్రైవర్ సయ్యద్ క్యాబిన్ లో ఇరుక్కపోయి తీవ్ర గాయాలయ్యాయి. ప్రమాదం సమాచారం అందుకున్న స్థానికులు, గొర్రెల కాపర్లు వెంటనే స్పందించి సహాయక చర్యలు చేపట్టారు. కొయ్యుర్ పోలీసులకు సమాచారం ఇవ్వడంతో పోలీసులు వెంటనే సంఘటన స్థలానికి చేరుకుని వివరాలు సేకరిస్తున్నారు. ఈ ప్రమాదానికి అతివేగమే కారణమని ప్రాథమికంగా తెలుస్తోంది. ప్రమాదంతో కాటారం-మంథని ప్రధాన మార్గంలో ట్రాఫిక్ రెండుమూడు గంటలపాటు నిలిచిపోయింది. చనిపోయిన డ్రైవర్ శ్రీనివాస్ నిజామాబాద్ చెందిన వ్యక్తి కాగా గాయాలైన డ్రైవర్ సయ్యద్ రామగుండం వ్యక్తి సయ్యద్ భార్య నదేరా బేగం ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లుగా కొయ్యుర్ పోలీసులు తెలిపారు.
నాగులమ్మ క్రాస్ వద్ద ఘోర రోడ్డు ప్రమాదం
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES



