Tuesday, May 12, 2026
E-PAPER
Homeఖమ్మంమొక్కజొన్నను కొనుగోలు చేయలేని చేతగాని ప్రభుత్వం 

మొక్కజొన్నను కొనుగోలు చేయలేని చేతగాని ప్రభుత్వం 

- Advertisement -

మీ దినానికి మొక్కజొన్నలను కొనుగోలు చేస్తారా 
దిక్కుమాలిన స్థితిలో ప్రభుత్వము ఉంద
ముగ్గురు మంత్రులు దోచుకోవటంలో పోటీ
జడ్పీ మాజీ చైర్మన్ లింగాల కమల్ రాజు 
నవతెలంగాణ – బోనకల్ 

మొక్కజొన్నలను కూడా కొనుగోలు చేయలేని దద్దమ్మ, చేతకాని కాంగ్రెస్ ప్రభుత్వం అని, మీ దినానికి మొక్కజొన్నలు కొనుగోలు చేస్తారా? దిక్కుమాలిన స్థితిలో కాంగ్రెస్ ప్రభుత్వం ఉందని జిల్లా పరిషత్ మాజీ చైర్మన్ లింగాల కమల్ రాజు ఘాటుగా విమర్శలు వర్షం కురిపించారు. కాంగ్రెస్ ప్రభుత్వం మొక్కజొన్నలను కొనుగోలు చేయకుండా రైతులను ఇబ్బందులకు గురి గురి చేయటాన్ని నిరసిస్తూ స్థానిక ఖమ్మం బస్టాండ్ సెంటర్లో సోమవారం రాస్తారోకో నిర్వహించారు. ఈ సందర్భంగా లింగాల కమల్ రాజు మాట్లాడుతూ మొక్కజొన్న కొనుగోలు పై కాంగ్రెస్ ప్రభుత్వ వైఖరిని నిరసిస్తూ మండుటెండలో ఆందోళన చేయవలసిన పరిస్థితి ఏర్పడిందన్నారు.

కెసిఆర్ అధికారంలో ఉన్న పది సంవత్సరాల సమయంలో ఏనాడు రైతులు సాగర నీటి కోసం, పంటలు కొనుగోలు చేయాలని ఆందోళన చేయలేదన్నారు. ఈ దిక్కుమాలిన ప్రభుత్వంలో రైతులకు అన్ని కష్టాలేనని ఘాటుగా విమర్శల వర్షాలు కురిపించారు. కాంగ్రెస్ రెండున్నర సంవత్సరాల పరిపాలనలోని రైతులు ఏనాడూ ఎరగని చూడని కష్టాలను చూస్తున్నారని విమర్శించారు. ప్రస్తుత వాతావరణం చూస్తుంటే వర్షాలు ఎప్పుడు వస్తాయో తెలియని అయోమయ పరిస్థితి ఉందని, ఈ వర్షాల వలన ధాన్యం, మొక్కజొన్న తడిస్తే రైతుల పరిస్థితి ఏమిటని ఆయన ప్రశ్నించారు. లారీలు, గన్ని సంచులు కూడా పంపించలేని స్థితిలో కాంగ్రెస్ ప్రభుత్వం ఉందన్నారు. కెసిఆర్ పంట వస్తుందనగానే ముందస్తు చర్యలు చేపట్టి రైతులకు ఎటువంటి ఇబ్బందులు తలెత్తకుండా ధాన్యాన్ని, మొక్కజొన్నలను కొనుగోలు చేసి చూపించారన్నారు. రైతు సమస్యలపై కాంగ్రెస్ ప్రభుత్వానికి చీమకుట్టినట్లు లేదని, మొద్దు నిద్ర పోతుందని విమర్శించారు. జిల్లాలో ముగ్గురు మంత్రులు ఉన్నారని, ఎవరి మార్గాన వారు ప్రజా సొమ్మును దోసుకుంటున్నారని ఆరోపించారు. ఒకరికి ఒకరికి సంబంధాలు ఉండవు, ఎవరికీ వారే ఎలా దోచుకోవాలో, ఏమి దోచుకోవాలో ఆలోచన తప్ప రైతు సమస్యలు పట్టడం లేదన్నారు. ముగ్గురు మంత్రులు ప్రజా సొమ్మును దండుకోటంలో పోటీ పడుతున్నారని విమర్శించారు.

రైతు భరోసా, పంటలను కొనుగోలు చేయలేని కాంగ్రెస్ ప్రభుత్వానికి రైతుల, ప్రజలు వచ్చే ఎన్నికలలో తగిన గుణపాఠం చెబుతారని హెచ్చరించారు. రైతు ప్రజా సమస్యలు పట్టించుకోవాల్సిన అవసరం లేదని, ఎన్నికల వచ్చిన రోజు డబ్బులు పంచి ఓట్లు కొనుక్కుందామనే ఆలోచనలో ఈ మంత్రులు ఉన్నారని విమర్శించారు. గన్ని సంచులు, లారీలు వెంటనే పంపించి కొనుగోలు చేసిన మొక్కజొన్నలను తరలించకపోతే రైతు ప్రజా ఉద్యమానికి బలికాక తప్పదని కాంగ్రెస్ ప్రభుత్వాన్ని హెచ్చరించారు. పండించిన పంటను కూడా కొనుగోలు చేయాలని రైతులు ఆందోళన చేయవలసిన పరిస్థితి కాంగ్రెస్ ప్రభుత్వంలో ఏర్పడిందని ఎద్దేవా చేశారు. ప్రపంచంలోనే రైతులకు రైతుబంధు వేసిన మొనగాడు కేసీఆర్ అన్నారు. ఈ కార్యక్రమంలో ఆ పార్టీ నాయకులు బానోతు కొండ, బంధం నాగేశ్వరరావు, గుండపనేని సుధాకర్ రావు, వేమూరి ప్రసాద్ రావు, తెల్లూరి రమేష్, కాకాని శ్రీనివాసరావు, తెల్లబోయిన నాగేశ్వరరావు, జెర్రిపోతుల రవీంద్ర, చావా హనుమంతరావు, కాకాని శ్రీనివాసరావు, కేతినేని సత్యనారాయణ, చిలక నాగరాజు, కన్నెపోగు సురేష్ తదితరులు పాల్గొన్నారు.

 ప్రత్యేక ఆకర్షణగా “చేపూరి వెంకటనారాయణ”
స్థానిక ఖమ్మం బస్టాండ్ సెంటర్లో రాస్తారోకో సందర్భంగా వినూత్న రీతిలో మండల పరిధిలోని బ్రాహ్మణపల్లి గ్రామానికి చెందిన రైతు చేపూరి వెంకటనారాయణ మండుటెండలో సుమారు గంటన్నర పాటు రోడ్డుపై పడుకొని నిరసన తెలిపారు. వెంకటనారాయణ నిరసన చూపుర్లను ప్రత్యేకంగా ఆకర్షించింది. గంటన్నర పాటు వెంకటనారాయణ మండుటెండలో పండుకోవటం, ప్రతి ఒక్కరిని ఆకర్షించడమే కాక ఆలోచింపజేసి, ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -