Tuesday, May 12, 2026
E-PAPER
Homeతెలంగాణ రౌండప్బండి భగీరత్ ను వెంటనే అరెస్టు చేయాలి

బండి భగీరత్ ను వెంటనే అరెస్టు చేయాలి

- Advertisement -

నవతెలంగాణ-కమ్మర్ పల్లి
బండి భగీరత్ ను వెంటనే అరెస్టు చేయాలని వేల్పూర్ మండలం బిఆర్ఎస్ నాయకులు రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఈ మేరకు మంగళవారం వేల్పూర్ మండల కేంద్రంలోని బిఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో బిఆర్ఎస్ టౌన్ అధ్యక్షుడు సామ ప్రతాప్, సీనియర్ నాయకుడు రేగుల్ల రాములు మాట్లాడారు. పిఓసిఎస్ఓ కేసులో 24 గంటల్లో అరెస్ట్ చేయాలని నిబంధనలు ఉన్నా, విచారణ చేయమని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పోలీస్ అధికారులను ఆదేశించడం విడ్డూరంగా ఉందని ఎద్దేవా చేశారు.మూడు రోజుల నుండి దేశం అంతా మారుమోగుతున్న ఘటన గురించి తనకు తెలియదన్నట్లు, ఎందుకు విచారణ చేయలేదని డీజీపీని అడగడం ఏంటని విమర్శించారు.

పిఓసిఎస్ఓ నిందితుడైతే 24 గంటల్లోపు అరెస్ట్ చేయాలని, లుక్ ఔట్ నోటీసులు జారీ చేయాలని డిమాండ్ చేశారు. బాధితులు ఫిర్యాదు చేసిన కేసు నమోదు చేయకుండా పోలీసులు తాత్సారం చేయడం కూడా ప్రజలు అన్నింటినీ గమనిస్తున్నారనే విషయం రేవంత్ రెడ్డికి తెలియకపోవడం విడ్డూరంగా ఉందన్నారు.ఈ విచారణకు ఆదేశించే కంటే ముందే  ముద్దాయి తండ్రి, బీజేపీ ప్రభుత్వంలో కేంద్ర మంత్రి బండి సంజయ్ ని తన ప్రియ మిత్రుడుగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డ అభివర్ణించడం వారి మధ్య ఉన్న బంధాన్ని తెలియజేస్తుందన్నారు. ప్రభుత్వం కఠినంగా వ్యవహరించి బండి భగీరత్ ను వెంటనే అరెస్టు చేసి బాధితురాలికి న్యాయం చేయాలని డిమాండ్ చేశారు.ఈ కార్యక్రమంలో వేల్పూర్ బిఆర్ఎస్ టౌన్ నాయకులు, కార్యకర్తలు, తదితరులు ఉన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -