– ప్రభుత్వ ఖజానాను దుర్వినియోగం చేయకండి :సీపీఐ(ఎం) రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు జూలకంటి రంగారెడ్డి
నవతెలంగాణ-మిర్యాలగూడ టౌన్
ఇటీవల దేశ ప్రధాని నరేంద్ర మోడీ చేసిన ప్రసంగం దయ్యాలు వేదాలు వల్లించినట్టుగా ఉన్న దని, ప్రభుత్వ ఖజానాను దుర్వినియోగపరిచే విధం గా బీజేపీ వ్యూహంగా ఉందని, దీన్ని ప్రజలు వ్యతిరేకి స్తున్నారని సీపీఐ(ఎం) రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు జూలకంటి రంగారెడ్డి అన్నారు. బుధవారం నల్ల గొండ జిల్లా దామరచర్ల మండలకేంద్రంలోని ఆ పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమా వేశంలో ఆయన మాట్లాడారు. నేడు మోడీ ప్రభుత్వం అనుసరిస్తున్న ప్రజా వ్యతిరేక విధానాలతో సామాన్య, మధ్య తరగతి ప్రజల ఆదాయాలు తగ్గిపోతున్నా యని, తద్వారా ప్రజలపై పన్నుల భారం పెరుగుతు న్నదని అన్నారు. కార్పొరేట్ల పెట్టుబడులు, లాభాలు దేశంలో విపరీతంగా పెరుగుతున్నాయని తెలిపారు. ఇటు సామాన్య ప్రజలపై మోయలేని విధంగా అన్ని వస్తువుల పైన అడ్డు అదుపు లేకుండా పన్నుల భారాలు మోపుతున్నారని అన్నారు. దేశ ప్రజలను కుదువపెట్టి అప్పు చేస్తున్నారని, అదేవిధంగా విదేశీ, స్వదేశీ కార్పొరేట్ శక్తులకు దేశ సంపదను ధారాదత్తం చేసే నిర్ణయాలు తీసుకుంటూ దేశ సార్వభౌమత్వాన్ని తాకట్టు పెడుతున్నారని విమర్శించారు. ప్రజలకు అవసరమైన మౌలిక సమస్యలపై పూర్తిగా వదిలేస్తూ రైతులకు, కార్మికులకు వ్యతిరేకంగా నల్ల చట్టాలను అమలు చేయడానికి పూనుకుంటున్నారని అన్నారు. ఇవన్నీ చేస్తూ నీతి బోధనలు చేయడం దయ్యాలు వేదాలు వల్లించినట్టు ఉన్నాయని ఆగ్రహం వ్యక్తం చేశారు. డీజిల్, పెట్రోల్ వాడకం తగ్గించడం అనే సూక్తులు చెప్పే మోడీ.. ఆయన మాత్రం రోడ్ షోల పేరుతో విపరీతంగా వాహనాలను వాడుతూ ప్రజా ధనాన్ని వృథా చేస్తున్నారని విమర్శించారు. మోడీ ప్రభుత్వం అందించే సహకారంతోనే నేడు దేశంలోనే అంబానీ, అదానీ సంపద రోజురోజుకు పెరగడం వాస్తవం కాదా అని ప్రశ్నించారు. మోడీ అసమర్థ పాలనతోనే ఇవాళ దేశంలోనే సామాన్య ప్రజలకు కావాల్సి నిత్యావసర వస్తువులు, గ్యాస్, పెట్రోల్, డీజిల్, ఎరువుల ధరలు రోజురోజుకు పెరుగుతు న్నాయని తెలిపారు. దేశంలోనే అన్ని వర్గాల ప్రజలు ఆలోచన చేస్తున్నారని, రానున్న కాలంలో మోడీ ప్రభుత్వానికి తగిన గుణపాఠం చెప్పక తప్పదన్నారు. ఈ కార్యక్రమంలో సీపీఐ(ఎం) రాష్ట్ర నాయకులు డబ్బికార్ మల్లేష్, జిల్లా కమిటీ సభ్యులు వీరేపల్లి వెంకటేశ్వర్లు, జిల్లా నాయకులు రవి నాయక్, మండల కార్యదర్శి మాలోతు వినోద్ నాయక్ తదితరులు పాల్గొన్నారు.
దయ్యాలు వేదాలు వల్లించినట్టు మోడీ ప్రసంగం
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES



