– సీపీఐ(ఎం) రాష్ట్ర కార్యదర్శి జాన్‌వెస్లీ
నవతెలంగాణ – స్టేషన్ ఘనపూర్
కామ్రేడ్ ఉడుత చేరాలు మరణం సీపీఐ(ఎం)కి తీరని లోటని ఆ పార్టీ రాష్ట్ర కార్యదర్శి జాన్ వెస్లీ అన్నారు. సీపీఐ(ఎం) రాష్ట్ర కమిటీ సభ్యులు కామ్రేడ్ ఉడుత రవీందర్ సోదరుడు ఉడుత చేరాలు(55) వారి స్వస్థలమైన జనగామ జిల్లా చిల్పూర్ మండలం క్రిష్ణాజిగూడెం గ్రామంలో మరణించారు. ఆయన భౌతికకాయాన్ని జాన్‌వెస్లీ బుధవారం సందర్శించి ఎర్రజెండా కప్పి నివాళ్లు అర్పించి అంతిమ యాత్రలో పాల్గొన్నారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. చేరాలు ఆశయ సాధనకు కృషి చేయాలని అన్నారు. నివాళి అర్పించిన వారిలో.. పార్టీ రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు ఎండీ అబ్బాస్, కేవీపీఎస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి స్కైలాబ్ బాబు, మత్స్యకారుల కార్మిక సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి లెల్లెల బాలకృష్ణ, రజక వృత్తిదారుల సంఘం రాష్ట్ర కార్యదర్శి పి. ఆశయ్య, జనగామ జిల్లా పార్టీ కార్యదర్శి మోకు కనకరెడ్డి, మహబూబాబాద్ జీఎంపీఎస్ జిల్లా అధ్యక్షకార్యదర్శులు పయ్యావుల మల్లయ్య, బొల్లం అశోక్, సిద్దిపేట జిల్లా జీఎంపీఎస్ జిల్లా కార్యదర్శి ఆలేటి యాదగిరి, జనగామ జిల్లా జీఎంపీఎస్ అధ్యక్షకార్యదర్శులు మోటి దేవేందర్, కన్నెబోయిన బాలరాజు, సీపీఐ(ఎం) మండల కార్యదర్శి సాదం రమేష్, గ్రామ ఉప సర్పంచ్ గద్ద కోమల, వార్డు సభ్యులు ఊరడి బుచ్చి రాజ్, గ్రామ కార్యదర్శి పోలు సంపత్, తదితరులు పాల్గొన్నారు.
కామ్రేడ్ ఉడుత చేరాలు మరణం పార్టీకి తీరని లోటు
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES



