– పురుగుల మందుతో రోడ్డెక్కిన రైతన్నలు
నవతెలంగాణ-విలేకరులు
వరి ధాన్యం కొనుగోళ్ల జాప్యంపై అన్నదాతలు ఆగ్రహం వ్యక్తం చేశారు. కొనుగోలు కేంద్రాల్లో ప్రభుత్వం నిర్లక్ష్యం వహించి రైతులను ఇబ్బంది పెడుతుందని, వెంట వెంటనే ధాన్యం కొనుగోలు చేయాలని రైతులు బుధవారం పలు జిల్లాల్లో ఆందోళనలు చేపట్టారు. మెదక్ జిల్లా చేగుంట మండలం మక్క రాజుపేట గ్రామంలో ఐకేపీ, పీఏసీఎస్ సొసైటీ ఆధ్వర్యంలో వరి ధాన్యం కొనుగోలు కేంద్రాలు వద్ద అధికారులు కొనుగోలు చేయకుండా ఇబ్బందులకు గురిచేయడంతో రైతులు పురుగుల మందు డబ్బాలతో రోడ్డుపై భైటాయించి నిరసన తెలిపారు. దాంతో సుమారు ఐదు కిలోమీటర్ల మేరకు ఎక్కడికక్కడే వాహనాలు నిలిచిపోయాయి. అనంతరం కొనుగోలు కేంద్రాల వద్దకు అధికారులు వెళ్లి పరిశీలించి రైతులకు నచ్చబెప్పి నిరసన విరమింపచేశారు. సంగారెడ్డి జిల్లా చౌటకూర్ మండలం లోని నాందేడ్ – అకోలా 161 జాతీయ రహదారిపై కొర్పోల్ గ్రామానికి చెందిన రైతులు ధర్నా నిర్వహించారు. సుల్తాన్‌పూర్ వద్ద జాతీయ రహదారిపైకి చేరుకున్న రైతులు, బస్తాల్లో ఉన్న వరి ధాన్యాన్ని రోడ్డుపై పోసి ప్రభుత్వానికి వ్యతిరేకంగా పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. ధాన్యం కొను గోలు చేయాలంటూ రోడ్డుపైనే బైటాయించడంతో సుమారు రెండు కిలోమీటర్ల మేర వాహనాలు నిలిచిపోయాయి. ఘట నాస్థలికి చేరుకున్న పోలీసులు రైతులతో చర్చలు జరిపారు. అనంతరం అధికారుల హామీతో నిరసనను విరమించారు.
ఖమ్మంలో మొక్కజొన్న కొనుగోళ్లపై ధర్నా
ఖమ్మం జిల్లా చింతకాని మండలంలోని మొక్కజొన్న రైతుల సమస్యలు పరిష్కరించాలని కోరుతూ సీపీఐ(ఎం) ఆధ్వర్యంలో రైతులు తహసీల్దార్ కార్యాలయాన్ని ముట్టడి చేసి ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా సీపీఐ(ఎం) మధిర డివిజన్ కార్యదర్శి మడుపల్లి గోపాలరావు మాట్లా డుతూ రైతులు నెల రోజులుగా తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొం టున్నారని తెలిపారు. కాంటాలు వేయకపోవడం, గన్నీ సంచుల కొరత, కాంటాలు వేసిన బస్తాలు తరలించేందుకు లారీలు లేకపోవడం వల్ల రైతులు తీవ్రంగా నష్టపోతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. మరోవైపు వర్షాల ప్రభావంతో రైతులు మరింత భయాందోళనకు గురవుతున్నారని అన్నారు. లోడైన ప్రతి లారీకి వెంటనే ట్రక్ షీట్లు ఇచ్చి గోదాములకు తరలించి దిగుమతి చేయాలని అధికారులను డిమాండ్ చేశారు. కాగా, రైతులు పండించిన మొత్తం మొక్కజొన్న బస్తాలను ఎలాంటి ఆన్‌లైన్ పరిమితులు లేకుండా కొనుగోలు చేసి గోదాములకు తరలిస్తామని అధికారులు హామీ ఇచ్చినట్టు ఆయన చెప్పారు. ధాన్యం కొనుగోలు వ్యవహారంలో రాష్ట్ర ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని ఖమ్మం జిల్లా పెనుబల్లి మండలంలో బీఆర్‌ఎస్ పార్టీ ఆధ్వర్యంలో నిర్వహించిన ధర్నాలో సత్తుపల్లి మాజీ ఎమ్మెల్యే సండ్ర వెంకట వీరయ్య మాట్లాడారు. వరి, మొక్కజొన్న కొనుగోళ్లలో జరుగుతున్న తీవ్ర జాప్యంపై రైతులతో కలిసి ఆందోళన వ్యక్తం చేస్తూ ప్రభుత్వ తీరును తీవ్రంగా తప్పుబట్టారు. అనంతరం తహసీల్దార్ వీరభద్ర నాయక్‌కు వినతిపత్రం అందజేశారు.
కొనుగోలు నిర్లక్ష్యం..
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES



