Thursday, May 14, 2026
E-PAPER
Homeసినిమాసొంత ఊరికి వెళ్ళిన ఫీల్ కలుగుతుంది

సొంత ఊరికి వెళ్ళిన ఫీల్ కలుగుతుంది

- Advertisement -

సువిక్షిత్, గీతికా రతన్ జంటగా ఓ యదార్థ సంఘటన ఆధారంగా రూపొందుతోన్న ఫీల్‌గుడ్ లవ్ ఎంటర్‌టైనర్ ‘దూరదర్శని’.కలిపింది ఇద్దరిని ఉపశీర్షిక. కార్తికేయ కొమ్మి దర్శకత్వంలో వారాహ మూవీ మేకర్స్ పతాకంపై జయ శంకర్ రెడ్డి.ఎం, పాటిమీది సంతోష్ ఈ చిత్రాన్ని నిర్మించారు. అన్ని పనులను పూర్తిచేసుకున్న ఈ చిత్రం ఈనెల 15న విడుదల కాబోతుంది. ఈ సందర్బంగా ఈ చిత్ర హీరో సువిక్షిత్ మీడియాతో ముచ్చటించారు. కడప జిల్లా రాయచోటి. నాకు వ్యాపారం ఉంది. చిన్నప్పటి నుండి సినిమాలంటే ప్యాషన్.. అనుకోకుండా ఈ సినిమా ద్వారా హీరోగా ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాను. రచయిత నారాయణ అరుణాచలంలో కలిసిన ఓ యాచకుడి జీవిత గాథ ఆధారంగా ఈకథను రాసుకున్నారు. అయితే ఈ సినిమాలో హీరో, హీరోయిన్ చనిపోయిన తరువాత హ్యపీ ఎండింగ్ ఎలా ఇచ్చాం. అసలు అరుణా చలంలోకి ఆ పెద్దాయన ఎలా వచ్చాడు? ఆయన జీవితంలో జరిగింది ఏమిటి అనేది కథ. 90లో ప్రతి ఒక్కరూ వాళ్ల ఊరిలో తిరిగొచ్చిన ఫీల్ కలుగుతుంది. ఇటీవల విడుదలైన టీజర్, పాటలు, ట్రైలర్‌కు మంచి స్పందన వస్తోంది. మా సినిమాని దాదాపుగా 250పైగా థియేటర్స్‌లో విడుదల చేస్తున్నాం. సినిమా టిక్కెట్‌తో పాటు కర్చీఫ్ కూడా ఇస్తామని ఎందుకు చెప్పామంటే, ఈ సినిమా చాలా ఎమోషనల్‌గా ఉంటుంది. ఆ ఎమోషన్ చూసి ఎడ్వకుండా ఎవ్వరూ ఉండలేరు. ఇకపై కూడా మంచి కథలతో హీరోగా సినిమాలు చేయాలని ఉంది.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -