Thursday, May 14, 2026
E-PAPER
Homeసినిమాస్పోర్ట్స్ అంటే క్రికెటే కాదు..

స్పోర్ట్స్ అంటే క్రికెటే కాదు..

- Advertisement -

స్పోర్ట్స్, కోర్ట్ డ్రామాగా గంగా ఎంటర్టైన్మెంట్స్, స్వస్తిక్ విజన్స్ సంయుక్త నిర్మాణంలో కేజేఆర్ హీరోగా ఎస్‌కే ప్రశాంత్, అజిత్ బాస్కర్, అరుణ్ మురుగన్ నిర్మించిన చిత్రం ‘గుర్తింపు’. జె.పి.తెన్ పతియాన్ దర్శకత్వం వహించారు. దేశంలోని క్రీడా వ్యవస్థ, రాజకీయ వ్యవస్థ, ప్రభుత్వ పనితీరు, పేదలు క్రీడలకు ఎంత దూరంలో ఉన్నారు అనే విష యాల్ని ఇతివృత్తంగా తీసుకుని ఈ సినిమాని తెరకెక్కిం చారు. తాజాగా ఈ సినిమాకి సంబంధించిన ట్రైలర్‌ను రిలీజ్ చేశారు. ‘క్రికెట్ మన నేషనల్ గేమ’.. ‘హాకీ మన నేషనల్ గేమ’.. ‘మన దేశానికి నేషనల్ గేమ్ అనేదే లేదు’, ‘మీరందరూ చూసే పది సెకన్లు కాదు సార్ నా జీవితం.. దాని వెనకాల నా 29 ఏళ్ల జీవితం, శ్రమ ఉంది సర్.. మీట్‌కి వెళ్తే గెలుస్తాం.. కానీ అక్కడి వరకు వెళ్లలేకపోతున్నాం’.. ‘మనలాంటి వాళ్లకి గేమ్ మామూలు విషయం కాదు.. అదే మనకు విడుదల’, ‘స్పోర్ట్స్ అని కొడితే క్రికెట్ గురించి మాత్రమే న్యూస్ వస్తుంది’, ‘అథ్లెటిక్స్‌లో గోల్డ్ గోల్డ్ అని రొమ్ము విరుచుకుని ముప్పావువంతు మెడల్స్ సాధించింది మీరు చెప్పిన ఆ కూటికి దిక్కులేని వాళ్లే మేడం’.. అంటూ ఓ పేదవాడు అథ్లెటిక్‌గా ఎదిగే క్రమంలో ఎలాంటి పరిస్థితుల్ని ఎదుర్కొన్నాడు.. ఈ ప్రయాణంలో క్రీడా శాఖ మంత్రిని కోర్టు మెట్లు ఎందుకు ఎక్కించాడు.. అసలు అతనికి ప్రభుత్వం నుంచి ఎలాంటి సమస్యలు వచ్చాయి.. కోర్టులో కోరుకున్న న్యాయం దక్కిందా? లేదా? అనే ఉత్సుకత కలిగించేలా ట్రైలర్‌ను కట్ చేశారు. ఈ మూవీని జూన్‌లో విడుదల చేసేందుకు చిత్రర యూనిట్ సన్నాహాలు చేస్తోంది.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -