Thursday, May 14, 2026
E-PAPER
Homeకరీంనగర్బస్సు, కారు ఢీ..ఇద్దరు మృతి

బస్సు, కారు ఢీ..ఇద్దరు మృతి

- Advertisement -

న‌వ‌తెలంగాణ‌-హైద‌రాబాద్ : కరీంనగర్ జిల్లా మానకొండూర్ మండలం చెంజర్ల శివారులో ఆర్టీసీ బస్సు, కారు ఢీకొన్న ఘోర రోడ్డు ప్రమాదంలో ఇద్దరు వ్యక్తులు అక్కడికక్కడే మృతి చెందారు. మంచిర్యాలకు చెందిన నలుగురు కరీంనగర్ వైపు వెళ్తుండగా, చెంజర్ల వద్ద కారు రాంగ్ రూట్‌లో వెళ్లడంతో ఎదురుగా వస్తున్న ఆర్టీసీ బస్సును బలంగా ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో కారు నుజ్జునుజ్జు అయింది. కారు డ్రైవర్‌తో పాటు ఒక వ్యక్తి మృతి చెందగా, మరో ఇద్దరికి తీవ్ర గాయాలయ్యాయి. పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని క్షతగాత్రులను ఆసుపత్రికి తరలించారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -