– జుక్కల్ మాజీ ఎమ్మెల్యే హనుమంత్ సిండే డిమాండ్
నవతెలంగాణ – మద్నూర్
రైతులు నష్టపోకుండా రాష్ట్ర ప్రభుత్వం వెంటనే చర్యలు చేపట్టి ఆదుకోవాలని జుక్కల్ మాజీ ఎమ్మెల్యే హనుమంతు షిండే రాష్ట్ర ప్రభుత్వానికి డిమాండ్ చేశారు. రైతు సమస్యలపై బీఆర్ఎస్ మండల శాఖ ఆధ్వర్యంలో మండల కేంద్రంలోని పాత బస్టాండ్ సమీపంలో మహాధర్న ఆందోళన కార్యక్రమాన్ని చేపట్టారు. ఈ ధర్నా ఆందోళనకు జుక్కల్ మాజీ ఎమ్మెల్యే హనుమంత్ షిండే హాజరై రైతు సమస్యలపై మాట్లాతూ.. రైతులు పండించిన పంటలు నెలలు తరబడి రోడ్లపైనే ఉంటున్నాయని, మద్దతు ధర కొనుగోలు వెంటనే చేపట్టి రైతులకు ఆదుకోవాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.
ముఖ్యంగా జొన్నలు, మక్కా పంట, సూర్యపూల్ తదితర పంటలు కొనుగోలు జరగక రైతులు ఆందోళన చెందుతున్నారని, ఇదివరకు సోయా, శనగ పంటలు కొనుగోళ్లలో శనగ పంటకు డబ్బులు రాక రైతులు నెలల తరబడి ఎదురుచూస్తున్నట్లు ప్రస్తుతం జొన్న పంట మొక్క పంట వేలాది క్వింటాళ్లు కొనుగోలు జరగక రైతులు ఇబ్బందులు పడుతున్నారని అకాల వర్షాలు పడితే భారీ నష్టం వాటిల్లుతుందని, రైతులు నష్టపో కుండా ప్రభుత్వం వెంటనే చర్యలు చేపట్టాలని డిమాండ్ చేశారు. కొనుగోలు జరిగిన పంటలకు వెనువెంటనే డబ్బులు చెల్లించాలని అన్నారు. ఈ ఆందోళన కార్యక్రమంలో బీఆర్ఎస్ పార్టీ మండల నాయకులు బన్సీ పటేల్, వై గోవింద్ పటేల్, పాకల విజయ్, కంచిన్ హనుమాన్లు, గఫర్, కృష్ణ, సురేష్, రాజు, వివిధ గ్రామాల నుండి మాజీ సర్పంచులు మాజీ ఎంపిటిసిలు పార్టీ నాయకులు కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.



