Thursday, May 14, 2026
E-PAPER
Homeతెలంగాణ రౌండప్నీట్ పేపర్ లీక్ ఘటనపై కేంద్ర ప్రభుత్వ దిష్టిబొమ్మ దహనం

నీట్ పేపర్ లీక్ ఘటనపై కేంద్ర ప్రభుత్వ దిష్టిబొమ్మ దహనం

- Advertisement -

నవతెలంగాణ – కామారెడ్డి : దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన నీట్ (NEET) పేపర్ లీక్ ఘటనపై ఆగ్రహం వ్యక్తం చేస్తూ కామారెడ్డి పట్టణంలోని ఇందిరాగాంధీ చౌక్ వద్ద కాంగ్రెస్ పార్టీ నాయకులు కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా నిరసన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఆధ్వర్యంలోని కేంద్ర ప్రభుత్వ దిష్టిబొమ్మను దహనం చేస్తూ తీవ్ర నిరసన తెలిపారు. ఈ కార్యక్రమం యూత్ కాంగ్రెస్ నియోజకవర్గ అధ్యక్షులు గుడుగుల శ్రీనివాస్ ఆధ్వర్యంలో నిర్వహించారు.

ఈ సందర్భంగా గుడుగుల శ్రీనివాస్ మాట్లాడుతూ.. దేశంలో లక్షలాది మంది విద్యార్థులు ఎంతో కష్టపడి చదువుకొని భవిష్యత్తు కోసం పోటీ పరీక్షలకు సిద్ధమవుతుంటే, పేపర్ లీక్‌ల వంటి ఘటనలు వారి ఆశయాలను దెబ్బతీస్తున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. నీట్ పరీక్ష దేశవ్యాప్తంగా విద్యార్థుల భవిష్యత్తును నిర్ణయించే అత్యంత కీలకమైన పరీక్ష అని, అలాంటి పరీక్షలో పేపర్ లీక్ జరగడం కేంద్ర ప్రభుత్వ వైఫల్యానికి నిదర్శనమని విమర్శించారు.

విద్యార్థుల జీవితాలతో చెలగాటమాడుతున్న కేంద్ర ప్రభుత్వం వెంటనే బాధ్యత వహించాలని డిమాండ్ చేశారు. పట్టణ కాంగ్రెస్ అధ్యక్షులు ఐరేని సందీప్ కుమార్ మాట్లాడుతూ, పేద, మధ్యతరగతి కుటుంబాలకు చెందిన విద్యార్థులు రాత్రింబవళ్లు కష్టపడి చదువుకుంటుంటే, కొందరు అక్రమాలకు పాల్పడుతూ పరీక్షా వ్యవస్థను అపవిత్రం చేస్తున్నారని అన్నారు. ఇటువంటి ఘటనలు పునరావృతం కాకుండా కేంద్ర ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకోవాలని, పేపర్ లీక్‌ల వెనుక ఉన్న అసలు నిందితులను గుర్తించి కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు. అలాగే విద్యార్థుల భవిష్యత్తును రక్షించేందుకు పారదర్శకమైన పరీక్షా విధానాన్ని అమలు చేయాలని, పరీక్షల నిర్వహణలో నిర్లక్ష్యం వహించిన అధికారులపై కూడా చర్యలు తీసుకోవాలని కోరారు. విద్యార్థుల పట్ల కాంగ్రెస్ పార్టీ ఎల్లప్పుడూ అండగా ఉంటుందని తెలిపారు.

ఈ కార్యక్రమంలో కామారెడ్డి రూరల్ అధ్యక్షులు రాజా గౌడ్, డీసీసీ ఉపాధ్యక్షులు గంప ప్రసాద్, యూత్ కాంగ్రెస్ కామారెడ్డి మండల అధ్యక్షులు రామ్ కుమార్, షేరు, సిద్దిక్, యూనుస్, కాళ్ల గణేష్, వడ్ల సురేష్, భరత్ టింకు, జమీల్, సుపియన్, హనుమాన్ల రవి, అనిల్, బషీర్, నిరంజన్, అనిరుద్ గౌడ్, పెద్ది శీను, రషీద్, కాంగ్రెస్ పార్టీ కార్యాలయ కార్యదర్శి లక్కపతిని గంగాధర్ తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -