Thursday, May 14, 2026
E-PAPER
Homeతెలంగాణ రౌండప్మారుతి నగర్ లో మన ఊరు-మన భద్రత-మన బాధ్యత కార్యక్రమం

మారుతి నగర్ లో మన ఊరు-మన భద్రత-మన బాధ్యత కార్యక్రమం

- Advertisement -

నవతెలంగాణ – కమ్మర్ పల్లి : మండలంలోని హాస కొత్తూర్ గ్రామ పరిధిలోని మారుతి నగర్ లో గురువారం కమ్మర్ పల్లి పోలీసుల ఆధ్వర్యంలో మన ఊరు – మన భద్రత – మన బాధ్యత అనే కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో భాగంగా గ్రామస్తులకు భద్రత, నేరాల నియంత్రణ, సామాజిక బాధ్యతపై ప్రజలకు అవగాహన కల్పించారు.ఈ సందర్భంగా పోలీసులు గ్రామస్తులతో మాట్లాడుతూ పలు కీలక అంశాలపై అవగాహన కల్పిస్తూ  తప్పనిసరిగా ట్రాఫిక్ నియమాలను పాటించాలని, హెల్మెట్ ధరించాలని సూచించారు.

యువత మత్తు పదార్థాలకు బానిస కాకుండా జాగ్రత్త వహించాలని, గ్రామంలో అసాంఘిక కార్యకలాపాలు జరిగితే పోలీసులకు సమాచారం ఇవ్వాలని కోరారు.మారుతున్న కాలానికి అనుగుణంగా పెరుగుతున్న సైబర్ నేరాల పట్ల అప్రమత్తంగా ఉండాలని, గుర్తుతెలియని వ్యక్తులకు ఓటిపిలు చెప్పకూడదని హెచ్చరించారు.గ్రామంలో భద్రతను పటిష్టం చేయడానికి ప్రతి వీధిలో సిసి కెమెరాలు ఏర్పాటు చేసుకోవాలని, దీనివల్ల నేరాలను అరికట్టవచ్చని గ్రామస్తులకు వివరించారు.ప్రజల సహకారంతోనే శాంతిభద్రతలను కాపాడటం సాధ్యమవుతుందని పోలీసులు ఈ సందర్భంగా తెలియజేశారు. ఈ కార్యక్రమంలో గ్రామస్తులు, మహిళలు, యువత అధిక సంఖ్యలో పాల్గొన్నారు. 

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -