Thursday, May 14, 2026
E-PAPER
HomeNewsదుమ్ము ధూళి కణాల ప్రవేశంతో గిరిజన తండా వాసులకు సమస్యలు

దుమ్ము ధూళి కణాల ప్రవేశంతో గిరిజన తండా వాసులకు సమస్యలు

- Advertisement -

నవతెలంగాణ – జుక్కల్ 
వెసవి కాలంలో ఈ పొగమంచు ఏంటి అని అనుకుంటున్నారా? అయితే మీరు పొరపాటు పడినట్టే… విషయం ఏమిటంటే జుక్కల్ మండలంలోని “కల్లాలి గేట్ నుండి మొహమ్మదాబాద్ గేట్ ” వరకు ఉన్న జుక్కల్ X రోడ్డు (BT Road) ను సంవత్సరం క్రితం మారమ్మత్తు పనులు మొదలు పెట్టారు ఆ తర్వాత 6 నెలల క్రితం కంకర మిశ్రమంను రోడ్డు పై పరచడం జరిగింది.

 హమ్మయ్య ఈగ రోడ్డు త్వరగా పూర్తి అయిపోతుందని గ్రామ వాసులందరం ఊపిరి పీల్చుకున్నాము కాని అసలు సమస్య అక్కడే మొదలైంది.కంకర పరిచినప్పటి నుండి మేము అనుక్షణం దుమ్ము దూళిని తింటున్నాము పొగను త్రాగుతున్నాము ఇంట్లో ప్రతి మూల మూలన తెల్లని దుమ్ము పేరుకొని పోయింది. స్వచ్ఛమైన గాలిని పిలిచి ఎన్ని రోజులు అవుతుందో ఇది మా మహమ్మాదాబాద్ తాండ గ్రామ పరిస్థితి.

ఒక వేల రోడ్డు పనులు పూర్తి చేయుటకు ఫండ్స్ లేకపోతె కనీసం ట్యాంకర్ తో వాటర్ కొట్టచ్చు కదా? ఈగ అది కూడా చేయము అంటే ప్రజల ఆరోగ్యం ఏమి కావాలి? మీ ఆరోగ్యం ఎంతనో మా గ్రామ ప్రజల ఆరోగ్యం అంతే కదా అని ప్రశ్నిస్తున్నారు. ఆర్ అండ్ బి , డీఈ,  ఏఈ, బాధ్యత వహించాలని తండావాసులు కోరుతున్నారు. అదేవిధంగా మండల స్థాయిలో ఉన్న ప్రజా పతినిధులు  సమస్పరిష్కరించడానికి తమ వంతుగా కృషి  చేయాలని తండావాసులు ముక్తకంఠంతో తెలిపారు. లేకుంటే జిల్లా కలెక్టర్ గారి ఫిర్యాదు  చేస్తానని తండావాసులు పేర్కొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -