Thursday, May 14, 2026
E-PAPER
Homeతెలంగాణ రౌండప్కొండాపూర్ మండలంలో ఆకస్మిక తనిఖీలు..

కొండాపూర్ మండలంలో ఆకస్మిక తనిఖీలు..

- Advertisement -

నవతెలంగాణ – కొండాపూర్
కొండాపూర్ మండల విద్యాధికారి (MEO) దశరథ్ మండల పరిధిలోని పలు పాఠశాలలను ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ తనిఖీల్లో భాగంగా పెప్సీ మల్కాపూర్ సమీపంలోని శ్రీ BBR జెనిత్ హై స్కూల్‌ను పరిశీలించారు. ఈ సందర్భంగా పాఠశాల అనుమతులు, సంబంధిత పత్రాలపై వాకబు చేయగా, సరైన ప్రభుత్వ అనుమతులు లేకుండానే పాఠశాలను నిర్వహిస్తున్నట్లు గుర్తించారు. దీంతో అధికారులు వెంటనే ఆ పాఠశాలను సీజ్ చేసి, జరిగిన విషయాన్ని పై అధికారులకు నివేదించారు. అనుమతులు లేకుండా విద్యాసంస్థలు నిర్వహిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని మండల విద్యాధికారి హెచ్చరించారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -