Thursday, May 14, 2026
E-PAPER
Homeతెలంగాణ రౌండప్బండి భగీరధున్ని వెంటనే అరెస్టు చెయ్యాలి

బండి భగీరధున్ని వెంటనే అరెస్టు చెయ్యాలి

- Advertisement -

– ఐద్వా జిల్లా అధ్యక్షురాలు గొంది దేవేంద్ర 
నవతెలంగాణ-గోవిందరావుపేట

కేంద్ర ప్రభుత్వ హోం శాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమారుడు బండి భగీరథునం వెంటనే అరెస్టు చేయాలని ఐద్వా జిల్లా అధ్యక్షురాలు గొంది దేవేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. గురువారం  మండలం లోని పసర గ్రామంలో. ఐద్వా మహిళా సంఘం సమావేశం. ఐద్వా జిల్లా సహాయ కార్యదర్శి శ్రీరామోజు సువర్ణ అధ్యక్షతన సమావేశం జరిగింది. ఈ సమావేశానికి ముఖ్య అతిథిగా. ములుగు జిల్లా మహిళా సంఘం జిల్లా అధ్యక్షురాలు. గొంది దేవేంద్ర హాజరై మాట్లాడుతూ..కేంద్ర బీజేపీ ప్రభుత్వ హోం శాఖ సహాయ మంత్రి బండి సంజయ్  కుమారుడు బండి భగీరథు. ఒక మైనర్ బాలికపై లైంగికదాడి కేసు వారం రోజులు గడుస్తున్నా. ఇంతవరకు రాష్ట్ర పోలీస్ ఉన్నతాధికారులు అతనిని అరెస్టు చేయకుండా నిమ్మకు నీరెత్తినట్టుగా వ్యవహరిస్తున్నారంటే. భారతదేశంలో మహిళలకు రక్షణ లేకుండా పోయిందని వాపోయారు.

అదేవిధంగా ఒక ఆడపిల్ల పై అఘాయిత్యం జరిగితే. ఇంతవరకు ప్రభుత్వం నుండి ఎలాంటి స్పందన లేదు. అంటే. రాజకీయ నాయకులు మంత్రులకు. ఒక న్యాయం. సామాన్య ప్రజానీకానికి ఒక న్యాయమా అని ఆమె మాట్లాడారు. అందరి దృష్టిలో చట్టం ఒకటే కాబట్టి. బాలికపై అఘాయిత్యానికి పాల్పడిన. కేంద్ర మంత్రి బండి సంజయ్  . కుమారుడు బండి భగీరథున్ని. వెంటనే అరెస్టు చేసి ఆ బాలిక కుటుంబానికి ప్రభుత్వ తరపున రక్షణ కల్పించి న్యాయం చేయాలని కోరారు. అదేవిధంగా భవిష్యత్తులో మహిళలపై ఇలాంటి సంఘటనలు జరగకుండా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు చర్యలు తీసుకొని. మహిళలకు రక్షణ కల్పించాలని చట్టాలను కఠినంగా అమలు చేయాలని అన్నారు.  ఈ సమావేశంలో. ఐద్వా మహిళా సంఘం నాయకులు ఊకే సమ్మక్క. సంకినేని రాజేశ్వరి. లాకావత్ కౌసల్య. అనసూర్య. అచ్చమ్మ. కమలమ్మ తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -