Thursday, May 14, 2026
E-PAPER
HomeNewsప్రైవేటుని ఆశ్రయించవద్దు.. ప్రభుత్వ కళాశాలలో విద్య ముద్దు 

ప్రైవేటుని ఆశ్రయించవద్దు.. ప్రభుత్వ కళాశాలలో విద్య ముద్దు 

- Advertisement -

నవతెలంగాణ – ఆలేరు టౌను:  ప్రయివేటు నీ ఆశ్రయించవద్దని, ప్రభుత్వ కళాశాలలో విద్య ముద్దని, ఆలేరు మున్సిపల్ చైర్మన్ బీజనా బాలమణి భాస్కర్, ప్రభుత్వ డిగ్రీ కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ రాజారామ్ అన్నారు.  ఆలేరు పట్టణంలో గురువారం ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో ప్రజా పాలన, ప్రగతి ప్రణాళిక లో భాగంగా విద్యా వారోత్సవాలను నిర్వహించారు. ఆలేరు మున్సిపాలిటీ వార్డు సభ్యులు,  మండల పరిధిలోని 16 గ్రామాలకు చెందిన సర్పంచులు ఉపసర్పంచులు సమావేశానికి హాజరయ్యారు.  

ఈ సందర్భంగా మాట్లాడుతూ ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో అన్ని సౌకర్యాలతో కూడినటువంటి వసతులు ఉన్నాయని, విద్యార్థులను డిగ్రీ కళాశాలలో చేరే విధంగా ప్రోత్సహించడం మనందరి బాధ్యత అని గుర్తు చేశారు.  మండల అభివృద్ధి అధికారి ఎంపీడీవో సత్య ఆంజనేయ ప్రసాద్ మాట్లాడుతూ  ప్రభుత్వ  కళాశాలల అభ్యున్నతికి  తన వంతు బాధ్యతగా పూర్తి  సహాయ సహకారాలు అందిస్తానన్నారు.  ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో విద్యార్థులు చేర్పించి ఉన్నత విద్యా వ్యవస్థనుకాపాడుకోవాల్సిన బాధ్యత మన మీద ఉందని, మున్సిపల్ కౌన్సిలర్లు, సర్పంచులు, ఉప సర్పంచులు వార్డు సభ్యులు  తమ వంతు బాధ్యత స్వీకరించాలన్నారు.  

ప్రముఖ సామాజికవేత్త జనగామ ఉపేందర్ రెడ్డి మాట్లాడుతూ.. విద్యార్థులకు డ్రెస్ కోడ్  ఉండాలని సూచించారు.  ప్రభుత్వ పాఠశాలలు, కళాశాలలో చదివేందుకు ప్రభుత్వం మరింతగా  మరింతగా ప్రోత్సహించేందుకు సౌకర్యాలు కల్పిస్తుందని  అన్నారు. ప్రైవేటు వద్దని ,ప్రభుత్వ కళాశాలలు, పాఠశాలలను ప్రోత్సహించాలని, విద్యార్థుల తల్లిదండ్రుల దిశగా ఆలోచించాలని కోరారు. ఈ సందర్భంగా విద్యార్థులను ప్రభుత్వ కళాశాలలలోని చదివేల ప్రోత్సహిస్తామని, మున్సిపాలిటీ కౌన్సిలర్లు, సర్పంచులు ముక్తకంఠంతో నినాదించారు. ప్రభుత్వ డిగ్రీ కళాశాల ఆలేరులో అడ్మిషన్ తీసుకో విధంగా చొరవ తీసుకుంటామని హామీ ఇచ్చారు.

 ఈ కార్యక్రమంలో మున్సిపల్ కౌన్సిలర్లు, సర్పంచులు, ఉప సర్పంచ్లు, కళాశాల అధ్యాపకులు, సిబ్బంది, విద్యార్థుల తల్లిదండ్రులు  అధిక సంఖ్యలో పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -