నవతెలంగాణ – హుస్నాబాద్ రూరల్
ప్రభుత్వ పాఠశాలల్లో ప్రభుత్వం నాణ్యమైన విద్య అందిస్తుందని ప్రతి ఒక్కరూ తమ పిల్లలను ప్రభుత్వ బడులలో చేర్పించాలని పలు గ్రామాల సర్పంచ్ లు కోరారు. గురువారం హుస్నాబాద్ మండలంలోని పందిల్ల, గాంధీనగర్, పోతారం ఎస్ మాలపల్లి, తోటపల్లి గ్రామాలలో బడి బాట చేపట్టారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ప్రైవేట్ కు దీటుగా ప్రభుత్వ బడులలో విద్య అందుతుందని తెలిపారు. అందరి సహకారంతో ప్రభుత్వ బడులను బలోపేతం చేద్దామన్నారు. ఈ కార్యక్రమంలో గాంధీనగర్ సర్పంచ్ ,సర్పంచ్ ల ఫోరం మండల అధ్యక్షుడు పోలు సంపత్, పందిల్ల సర్పంచ్ తోడేటి రమేష్, మాలపల్లి సర్పంచ్ వెన్న స్వర్ణలత రాజు, పోతారం ఎస్ గ్రామ ఉప సర్పంచ్ బొమ్మగాని రాజ్ కుమార్, బంక లక్ష్మి చందు తదితరులు పాల్గొన్నారు.
విద్యార్థులను ప్రభుత్వ బడిలో చేర్పించాలి
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES



