హీరో రామ్ చరణ్ మచ్ నటించిన రూరల్ యాక్షన్-స్పోర్ట్స్ డ్రామా ‘పెద్ది’పై రోజురోజుకీ అంచనాలు మరింత పెరుగుతున్నాయి. దేశవ్యాప్తంగా భారీ ప్రమోషన్స్‌తో చిత్రబృందం సినిమాపై హైప్‌నుమరో స్థాయికి తీసుకెళ్తోంది.ఇప్పటికే విడుదలైన రెండు హై-వోల్టేజ్ పాటలు, రెండు విభిన్న గ్లింప్సెస్ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకోవడంతో సినిమాపై భారీ బజ్ ఏర్పడింది. బుచ్చిబాబు సానా దర్శకత్వంలో వృద్ధి సినిమాస్ బ్యానర్‌పై నిర్మాత వెంకట సతీష్ కిలారు భారీ స్థాయిలో నిర్మిస్తున్న ఈ చిత్రాన్ని మైత్రి మూవీ మేకర్స్, సుకుమార్ రైటింగ్స్ సమర్పిస్తున్నాయి. జూన్ 4న గ్రాండ్ పాన్ ఇండియా రిలీజ్‌కు సిద్ధమవుతుండగా, జూన్ 3న స్పెషల్ ప్రీమియర్స్ ప్రదర్శించనున్నారు. ఇదిలా ఉండగా, ఇప్పటివరకు ఎప్పుడూ చూడని రీతిలో పాన్ ఇండియా ప్రమోషనల్ క్యాంపెయిన్‌ను టీమ్ ప్రారంభించింది. ‘పెద్ది పవర్‌ప్లే టూర్’ ఈనెల 18న ముంబైలో గ్రాండ్ ట్రైలర్ లాంచ్‌తో ప్రారంభం కానుంది. అన్ని ప్రధాన భాషల్లో థియేట్రికల్ ట్రైలర్‌ను విడుదల చేయనున్నారు. అలాగే ఈనెల 22న ఉప్పల్ స్టేడియంలో జరగనున్న ఎస్ ఆర్ హెచ్, ఆర్ సి బి మ్యాచ్ సందర్భంగా చిత్రబృందం ప్రత్యేకంగా హాజరు కానుండటం ప్రధాన ఆకర్షణగా మారనుంది. అనంతరం ఈనెల 23న భోపాల్, 24న బెంగళూరు, 28న ఢిల్లీ, 30న చెన్నై, జూన్ 1న విజయనగరం, జూన్ 2న హైదరాబాద్‌లో భారీ ఈవెంట్స్ నిర్వహించనున్నారు. అంతేకాదు, సమ్మర్ అంతా హైప్ కొనసాగించేలా మరిన్ని సర్‌ప్రైజ్‌లు కూడా సిద్ధం చేస్తున్నట్లు మేకర్స్ తెలిపారు.
‘పెద్ది` పవర్ ప్లే టూర్
- Advertisement -
- Advertisement -



