- Advertisement -
నవతెలంగాణ-మల్హర్ రావు: ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ప్రజా పాలన ప్రగతి ప్రణాళిక కార్యక్రమంలో భాగంగా విద్యా వారోత్సవాలను శుక్రవారం ఐదోరోజు తాడిచెర్ల ప్రభుత్వ జూనియర్ కళాశాలలో కళాశాల ప్రిన్సిపాల్ విజయదేవి పర్యవేక్షణలో గ్రంధాలయ దినోత్సవం వేడుకలు ఘనంగా నిర్వహించారు.ఈ సందర్భంగా విద్యార్థులకు గ్రంథాలయం ఆవశ్యకత,ప్రాధాన్యత గురించి తెలుపుతూ గ్రంథపఠనం ద్వారా జ్ఞానము పెరుగుతుందని,ప్రతి విద్యార్థి సమయాన్ని వృథా చేయకుండా పుస్తక పఠనం చేయాలని చెప్పారు. అనంతరం బుక్స్ ఎగ్జిబిషన్, రీడింగ్ ఆక్టివిటీస్, డిజిటల్ లైబ్రరీ గురించి వివరించారు.ఈ కార్యక్రమంలో కళాశాల లైబ్రేరియన్ సమీరా,అధ్యాపకులు,కళాశాల సిబ్బంది,విద్యార్థులు పాల్గొన్నారు.
- Advertisement -



