నవతెలంగాణ – పరకాల
క్రీడల్లో విశేష ప్రతిభ కనబరిచి నాలుగు పతకాలను సొంతం చేసుకున్న పరకాల పోలీస్ స్టేషన్ హెడ్ కానిస్టేబుల్ నాగేల్లి సుజాతను పరకాల సీఐ వి.క్రాంతి కుమార్ అభినందించారు. హైదరాబాద్‌లోని మల్కాజిగిరి వేదికగా ఈ నెల 7 నుంచి 9వ తేదీ వరకు జరిగిన తెలంగాణ ఐదవ స్పోర్ట్స్ అండ్ గేమ్స్ మీట్‌లో సుజాత అత్యుత్తమ ప్రదర్శన కనబరిచారు. ఈ పోటీల్లో పాల్గొన్న ఆమె పవర్ లిఫ్టింగ్‌లో గోల్డ్ మెడల్, వెయిట్ లిఫ్టింగ్‌లో సిల్వర్ మెడల్, యుషు గేమ్‌లో సిల్వర్ మెడల్ మరియు బాక్సింగ్‌లో బ్రాంజ్ మెడల్ సాధించి పోలీస్ శాఖకు, పరకాల ప్రాంతానికి పేరు తెచ్చారు. ఈ సందర్భంగా గురువారం పరకాల పోలీస్ స్టేషన్‌లో సుజాతను ప్రత్యేకంగా అభినందించిన సీఐ క్రాంతి కుమార్, ఆమె మరిన్ని ఉన్నత శిఖరాలను అధిరోహించాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో ఏఎస్ఐ రమేష్, హెడ్ కానిస్టేబుల్ టి.సర్వన్, కానిస్టేబుల్ రాజయ్య, మహిళా కానిస్టేబుల్ శ్రీలత తదితరులు పాల్గొన్నారు.
నాలుగు పతకాలు సాధించిన హెడ్ కానిస్టేబుల్ సుజాతకు ఘన సన్మానం
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES



