Thursday, July 16, 2026
E-PAPER
Homeఆదిలాబాద్వర్షాల కోసం విద్యార్థుల కప్పతల్లి ఆట

వర్షాల కోసం విద్యార్థుల కప్పతల్లి ఆట

- Advertisement -

నవతెలంగాణ-కుభీర్
పది రోజులుగా మండలంలో వర్షం జాడలేక తీవ్ర ఆందోళనకు గురవుతున్న కుబీర్ మండల రైతుల కోసం గురువారం పల్సి విద్యా భారతి పాఠశాల విద్యార్థులు వినూత్న రీతిలో వాన దేవుడిని ప్రార్థించారు. ఇప్పటికే రైతులు విత్తనాలు, ఎరువులు, పురుగుల మందులు, కూలీల కోసం భారీగా పెట్టుబడులు పెట్టారు. అయితే ఈఏడాది లో ఆశించిన స్థాయిలో వర్షాలు కురువకపోవడంతో ఆ పెట్టుబడులు కూడా తిరిగి రాని పరిస్థితి నెలకొంది. కంటికి రెప్పలా పెంచుకున్న పంటలు కండ్ల ముందే ఎండిపోవడంతో రైతు ఎంతో నిరాశతో ఆకాశం వైపుకు ఎదురుచూస్తున్నాడు. వానదేవుడు ఒక్కసారైనా కరుణించవా అంటూ ఇటు విద్యార్థులు, ఉపాధ్యాయులు వరుణ దేవుడిని వేడుకుంటున్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -