Saturday, May 16, 2026
E-PAPER
Homeసినిమాలీలావతిగా కీలక పాత్ర

లీలావతిగా కీలక పాత్ర

- Advertisement -

అభిషేక్ నామా దర్శకత్వంలో విరాట్ కర్ణా నటించిన ‘నాగబంధం: ది సీక్రెట్ ట్రెజర్’ చిత్రం జూలై 3న థియేటర్లలో విడుదల కానుంది.ఈ నేపథ్యంలో అంచనాలు భారీగా పెరుగుతున్నాయి. ప్రతీ అప్‌డేట్‌తో ఈ చిత్రంపై బజ్ నెక్స్ట్ లెవల్ కి చేరుతోంది. ఇప్పటికే విడుదలైన టీజర్, గ్లింప్స్, సాంగ్స్ సినిమాపై మ్యాసీవ్ బజ్ క్రియేట్ చేశాయి.తాజాగా మేకర్స్ ఈ సినిమా నుంచి అనసూయ భరద్వాజ్ ఫస్ట్ లుక్ రిలీజ్ చేశారు. ‘లీలావతి’ పాత్రలో ఆమె లుక్ పవర్‌ఫుల్‌గా, మిస్టీరియస్‌గా కనిపిస్తోంది.సంప్రదాయ తెలుపు చీరలో, ట్రైబల్ జ్యువెలరీతో అనసూయ కనిపించిన తీరు పాత్రలోని తీవ్రతను ప్రతిబింబిస్తోంది. లీలావతి పాత్ర కథలో ఎంతో కీలకంగా ఉండబోతోందనే ఫీల్ ఈ పోస్టర్‌తోనే స్పష్టమవుతోంది.ఈ సినిమాలో నభా నటేష్, ఐశ్వర్యా మీనన్, రిషబ్ సావ్నీ, జగపతి బాబు, గరుడ రామ్, మహేష్ మాంజ్రేకర్, జయప్రకాశ్, మురళీ శర్మ, బి.ఎస్. అవినాష్ తదితరులు కీలక పాత్రల్లో నటిస్తున్నారు.ఎన్‌ఐకే స్టూడియోస్, అభిషేక్ పిక్చర్స్ నిర్మాణంలో వస్తున్న ‘నాగబంధం’ పౌరాణికం, చరిత్ర, యాక్షన్ అంశాల కలయికగా రూపొందుతోంది.”నాగబంధందేశవ్యాప్తంగా అన్ని వర్గాల ప్రేక్షకులను అలస్తుందనే నమ్మకంతో ఉన్నాం అని మేకర్స్ అన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -