కానీ జిన్‌పింగ్ చెప్పింది
బైడెన్ హయాం గురించే: ట్రంప్
నా హయాంలో మళ్లీ అమెరికా పుంజుకుంది
బీజింగ్ : అమెరికా క్షీణిస్తున్న దేశం అంటూ చైనా అధ్యక్షుడు షీ జిన్‌పింగ్ చేసిన వ్యాఖ్యలు 100 శాతం కరెక్ట్ అని అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ శుక్రవారం ఒప్పుకున్నారు. అయితే మాజీ ప్రెసిడెంట్ జో బైడెన్ నాలుగేండ్ల పాలనలో అమెరికా ఆర్థిక వ్యవస్థకు జరిగిన భారీ నష్టాన్ని ఉద్దేశించే జిన్‌పింగ్ ఈ వ్యాఖ్య చేశారని ఆయన పేర్కొన్నారు. నిద్ర మత్తులో బైడెన్ పాలన సాగించడంతో అమెరికా క్షీణించిన విషయం 100 శాతం సరైందేనన్నారు. తన హయాంలో అమెరికా మళ్లీ ప్రపంచంలోనే అగ్రగామి ఆర్థిక, సైనిక శక్తిగా ఆవిర్భవించిందని ట్రంప్ తెలిపారు. ఈమేరకు ఆయన ట్రూత్ సోషల్‌లో ఒక పోస్ట్ పెట్టారు. బహిరంగ సరిహద్దులు, అధిక పన్నులు, ట్రాన్స్‌జెండర్ అనుకూల విధానాలు, మహిళల క్రీడల్లోకి పురుషులు, వైవిధ్యం-సమానత్వం-సమ్మిళితత్వం, దారుణమైన వాణిజ్య ఒప్పందాలు, విచ్చలవిడి నేరాలు వంటి మరెన్నో కారణాలతో బైడెన్ పాలనలో అమెరికాకు అపార నష్టం జరిగిందని ట్రంప్ చెప్పారు.
ఒప్పందమా ? విధ్వంసమా ? ఇరానే తేల్చుకోవాలి : ట్రంప్
ఇరాన్ పనైపోయిందని అమెరికా ప్రెసిడెంట్ డొనాల్డ్ ట్రంప్ వ్యాఖ్యానించారు. తమతో ఒప్పందాన్ని కుదుర్చుకోవడం లేదంటే విధ్వంసాన్ని ఎదుర్కోవడం మినహా మరో మార్గం ఇరాన్‌కు లేదని ఆయన స్పష్టం చేశారు. తన చైనా పర్యటనలో చివరి రోజున(శుక్రవారం) బీజింగ్‌లో ఓ అమెరికన్ మీడియా సంస్థకు ఇచ్చిన ఇంటర్వ్యూలో ట్రంప్ ఈ వ్యాఖ్యలు చేశారు. అమెరికా, ఇరాన్ మధ్య ఒప్పందం కుదరాలని చైనా అధ్యక్షుడు షి జిన్‌పింగ్ కోరుకుంటున్నారని ఆయన తెలిపారు. ఈవిషయంలో అమెరికాకు చేతనైనంత సహాయం చేసేందుకు సిద్ధమని జిన్‌పింగ్ తనతో చెప్పారన్నారు. ఇరాన్‌కు చైనా సైనిక పరికరాలను ఇవ్వబోదని సైతం జిన్‌పింగ్ హామీ ఇచ్చారని ట్రంప్ పేర్కొన్నారు.
మా చమురు, వ్యవసాయ ఉత్పత్తులు, బోయింగ్‌లు చైనాకు
”జిన్‌పింగ్ ఆత్మీయ వ్యక్తి. ఆయన నిత్యం పనిలోనే నిమగమవుతారు. జిన్‌పింగ్‌లో నాకు అదే నచ్చింది. కొంతమంది నాయకులను ప్రశంసించినందుకు నేను తరచుగా విమర్శలను ఎదుర్కొంటాను.
కానీ దాదాపు 150 కోట్ల జనాభా ఉన్న దేశమైన చైనాకు నాయకుడిగా జిన్‌పింగ్‌ను నేను గౌరవిస్తాను. నాకు స్వాగతం పలుకుతూ సైనిక గౌరవ వందన కార్యక్రమం అద్భుతంగా నిర్వహించారు. మీరు హాలీవుడ్‌కు వెళ్లినా, అలాంటిది మీకు కనిపించదు. అమెరికా చమురును కొనమని జిన్‌పింగ్‌కు చెప్పాను. అందుకు ఆయన సానుకూలంగానే స్పందించారు. 200 బోయింగ్ విమానాలకు ఆర్డర్లు ఇచ్చేందుకు జిన్‌పింగ్ ఓకే చెప్పారు. అమెరికా వ్యవసాయ ఉత్పత్తులను కొనేందుకూ సిద్ధమని చైనా ప్రెసిడెంట్ నాతో చెప్పారు” అని ట్రంప్ పేర్కొన్నారు.
చైనా పవర్ సెంటర్‌లో ట్రంప్..
జోంగ్నాన్‌హై వెనుక..
చైనా పర్యటనలో ఉన్న అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ రెండో రోజు ఆ దేశాధినేత షీ జిన్‌పింగ్‌తో భేటీ అయ్యారు. ఈ సమావేశానికి ‘జోంగ్నాన్‌హై ‘ వేదికైంది. ప్రపంచంలోనే అత్యంత రహస్యమైన, శక్తిమంతమైన రాజకీయ కాంపౌండ్లలో ఇది ఒకటి. అధ్యక్షుడు షీ జిన్‌పింగ్ నివాసం ఉండే ఈ ప్రాంగణంలో విదేశీ నేతలకు ఆతిథ్యమివ్వడం అత్యంత అరుదు. అలాంటిది ఇప్పుడు ట్రంప్ ను ఇక్కడికి ఆహ్వానించడం ఆసక్తికరంగా మారింది.
ఇంతకీ ఏంటీ ‘జోంగ్నాన్‌హై’ ప్రత్యేకత..?
బీజింగ్‌లో ఉండే ‘జోంగ్నాన్‌హై’ కాంపౌండ్.. చైనీస్ కవ¶్యనిస్ట్ పార్టీ, కౌన్సిల్‌కు హెడ్‌క్వార్టర్. 1950 నుంచి అధికార కవ¶్యనిస్ట్ పార్టీ నేతలు ఇక్కడే నివాసం ఉంటూ పాలన సాగిస్తున్నారు. అధ్యక్షుడు షీ జిన్‌పింగ్ కూడా ఇందులోనే ఉంటారు. వైట్‌హౌస్ మాదిరిగా ఈ ప్రాంగణంలోకి వెళ్లేందుకు సాధారణ పౌరులకు అనుమతి ఉండదు. చైనా ప్రభుత్వ పాలసీ విధానాలకు సంబంధించి కీలక నిర్ణయాలను ఇక్కడే రూపొందిస్తారు. సంబంధిత నేతలు ఆ నిర్ణయాలను అధికారికంగా ప్రకటించేంతవరకు ఈ కాంపౌండ్ దాటి అవి బయటకు వెళ్లవు అనే పేరుంది. ఈ ప్రాంగణంలో లగ్జరీ నివాసాలు, అత్యాధునిక వైద్య సదుపాయాలతో పాటు అనేక సౌకర్యాలు ఉంటాయట.
‘అమెరికా క్షీణిస్తున్న దేశం’ అన్నది 100శాతం కరెక్ట్
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES



