నవతెలంగాణ-ఆర్మూర్
నియోజకవర్గంలోని డొంకేశ్వర్ మండలంలోని మారంపల్లి గ్రామంలో శనివారం గుర్తుతెలియని వ్యక్తులు ఈత చెట్లకు నిప్పు పెట్టడం తీవ్ర కలకలం రేపింది. సర్పంచ్ శివ రశి గంగాధర్ తెలిపిన వివరాల ప్రకారం.. గ్రామంలోని కమ్మరి కుంట కట్టపైన గుర్తు తెలియని వ్యక్తులు ఈత చెట్లకు నిప్పు పెట్టారని వాపోయారు. ఈ చర్యతో గౌండ్ల జీవనోపాధికి తీవ్ర నష్టం జరుగుతుందని తెలిపారు. వారికి చాలా అన్యాయం జరిగిందని అన్నారు. కులవృత్తిని నమ్ముకుని జీవనం సాగిస్తున్న వారు ఒక్కసారిగా రోడ్డున పడే పరిస్థితి వచ్చిందని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వం చొరవ తీసుకుని వారికి రెండు ఎకరాల భూమి, చెరువు కట్టలపై బోర్లు వేసి సింగల్ ఫేస్ మోటర్లు మంజూరు చేసి వారిని ఆదుకోవాల్సిందిగా కోరారు. ప్రభుత్వం ఈ విషయంలో నిర్లక్ష్యం వహించకుండా వెంటనే చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.
ఈత చెట్లకు నిప్పు పెట్టిన గుర్తు తెలియని దుండగులు
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES



