Saturday, May 16, 2026
E-PAPER
Homeతెలంగాణ రౌండప్ఉద్యమకారులను గుర్తించి కమిటీ వేసినందుకు ప్రభుత్వానికి కృతజ్ఞతలు

ఉద్యమకారులను గుర్తించి కమిటీ వేసినందుకు ప్రభుత్వానికి కృతజ్ఞతలు

- Advertisement -

జాతీయ బిసి సంఘం నాయకుడు విజయగిరి సమ్మయ్య
నవతెలంగాణ – మల్హర్ రావు

తెలంగాణ ఉద్యమకారులను గుర్తించేందుకు ప్రభుత్వం ఉన్నతస్థాయి కమిటీని ఏర్పాటు చేయడంపై జాతీయ బిసి సంక్షేమ సంఘం భూపాలపల్లి జిల్లా ఇంఛార్జి విజయగిరి సమ్మయ్య ప్రభుత్వానికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు.శనివారం కొయ్యుర్ ప్రెస్ క్లబ్ లో మాట్లాడుతూ..తెలంగాణ రాష్ట్రం రావడానికి అమరులైన ఉద్యమకారుల కుటుంబాలను,ఉద్యమంలో అన్ని వర్గాల ప్రజలు స్వచ్ఛందంగా సకల జన సమ్మెలో పాల్గొని అన్ని వర్గాలకుల వృత్తుల వారు సబ్బండ వర్ణాల ప్రజలు ఎలక్ట్రిషన్ మీడియా జర్నలిస్టు లు,ప్రజా సంఘాలు, కుల సంఘాలు పాల్గొన్న ప్రతి వర్గాన్ని ప్రభుత్వం గుర్తించాలని విజ్ఞప్తి చేశారు.గత ప్రభుత్వం ఉద్యమకారులను గుర్తించలేదన్నారు.ప్రభుత్వం ఏర్పాటు చేసిన కమిటీ చైర్మన్ సభ్యులందరికి ప్రత్యేక శుభాకాంక్షలు తెలిపారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -