అదనపు కలెక్టర్ మధుసూదన్ నాయక్
నవతెలంగాణ-మిడ్జిల్
కొనుగోలు కేంద్రానికి వచ్చిన ధాన్యాన్ని వెంటనే గోదాములకు తరలించాలని నిర్లక్ష్యం చేస్తే చర్యలు తప్పవని అదనపు కలెక్టర్ మధుసూదన్ నాయక్ అన్నారు. శనివారం మండల కేంద్రంలోని పిఎసిఎస్ కొనుగోలు కేంద్రాన్ని సందర్శించారు. అకాల వర్షాల నేపథ్యంలో రైతులకు ఇబ్బందులు లేకుండా వెంటనే రవాణా సౌకర్యం ఏర్పాట్లు చేయాలి సూచించారు. రైతులు తమ పంట దిగుబడిని తరలించేందుకు రవాణా సమస్యలు ఎదుర్కొంటున్నామని, వెంటనే వాహనాల సౌకర్యం కల్పించాలని అదనపు కలెక్టర్ దృష్టికి తీసుకువచ్చారు.
దీనిపై అదనపు కలెక్టర్ కాంట్రాక్టర్ మరియు మార్క్‌ఫెడ్ జిల్లా మేనేజర్‌తో చర్చించి, అకాల వర్షాలు వచ్చే అవకాశం ఉన్నందున రైతులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా తక్షణమే రవాణా ఏర్పాట్లు చేయాలని అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. ఈ కార్యక్రమంలో తహసిల్దార్ రాఘవేందర్ రెడ్డి, ఎంపీడీవో గీతాంజలి, పిఎసిఎస్ సిఓ బాల్ రెడ్డి, వివిధ గ్రామాలకు చెందిన రైతులు తదితరులు ఉన్నారు.



