Saturday, May 16, 2026
E-PAPER
Homeఖమ్మంవానాకాలం సాగుకు వ్యవసాయ శాఖ సమాయత్తం

వానాకాలం సాగుకు వ్యవసాయ శాఖ సమాయత్తం

- Advertisement -

– విత్తన, ఎరువుల డీలర్లకు పలు ఆదేశాలు
– రైతులకు సూచనలు
– ఏడీఏ పెంటేల రవి కుమార్
నవతెలంగాణ – అశ్వారావుపేట 

రాబోయే వానాకాలం సాగు సీజన్‌కు వ్యవసాయ శాఖ ముందస్తు ఏర్పాట్లు చేపట్టింది. రైతులకు నాణ్యమైన విత్తనాలు అందేలా చర్యలు తీసుకుంటూ, విత్తన డీలర్లు తప్పనిసరిగా పాటించాల్సిన నిబంధనలను ఏడీఏ పెంటేల రవి కుమార్ వెల్లడించారు. ఈ సందర్భంగా తన కార్యాలయం లో శనివారం ఆయన మాట్లాడుతూ, వ్యవసాయ శాఖ అనుమతి పొందిన లైసెన్సు కలిగిన డీలర్లు మాత్రమే విత్తనాల విక్రయానికి అర్హులని తెలిపారు. రైతులు విత్తనాలు కొనుగోలు చేసే సమయంలో తప్పనిసరిగా డీలర్ వద్ద నుంచి రసీదు తీసుకోవాలని సూచించారు. ఆ రసీదులో రైతు పేరు, విత్తన రకం, పరిమాణం, ధర, లాట్ నంబర్, విత్తన తయారీ కంపెనీ పేరు వంటి వివరాలు స్పష్టంగా ఉండాలని పేర్కొన్నారు.

విత్తనాలను ఒరిజినల్ ప్యాకెట్లలోనే విక్రయించాలనీ, లూస్‌గా అమ్మకాలు చేయరాదని ఆదేశించారు. గడువు ముగిసిన విత్తనాలను విక్రయిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. అలాగే డీలర్లు కొనుగోలు చేసిన మరియు విక్రయించిన విత్తనాల వివరాలను స్టాక్ రిజిస్టర్‌లో నమోదు చేయాలని సూచించారు. పంటల వారీగా, విత్తన రకాల వారీగా ఎంఆర్‌పీ ధరలను వినియోగదారులకు కనిపించే విధంగా ప్రదర్శించాలన్నారు. కల్తీ, డూప్లికేట్ విత్తనాల విక్రయంపై పీడీ యాక్ట్ ప్రకారం చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు.

పత్తి సాగులో హెచ్‌టీ కాటన్ విత్తనాలు నిషేధించబడినందున వాటి అమ్మకం చట్టరీత్యా అనుమతిలేదని తెలిపారు. డీలర్లు విత్తనాల నిల్వకు తగిన సౌకర్యాలు కల్పించి, మొలక శాతం దెబ్బతినకుండా జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -