జిల్లా కలెక్టర్ స్నేహ శబరిష్ మరియు ఎమ్మెల్సీ రవీందర్రావు చేతుల మీదుగా ప్రోత్సాహక బహుమతి
ఆలేరు ప్రభుత్వ పాఠశాల పీఈటి ఇమామ్
నవతెలంగాణ-నెల్లికుదురు
ప్రజా పాలన ప్రగతి పాలన 2026 విద్య వారోత్సవాల్లో భాగంగా ఆలేరు ప్రభుత్వ పాఠశాల చదువుతున్న 9వ తరగతి విద్యార్థి బానోతు యశ్వంత్ జాతీయస్థాయి రబ్బీ పోటీల్లో భువనేశ్వర్ లో పాల్గొని ప్రతిభ కనబరిచారని ఆ పాఠశాల వ్యాయామ ఉపాధ్యాయుడు ఇమామ్ తెలిపారు. ఆదివారం జిల్లా కేంద్రంలోని కలెక్టర్ కార్యాలయంలో డీఈఓ సత్యనారాయణమూర్తి ఆధ్వర్యంలో కలెక్టర్ స్నేహ శబరిష్, ఎమ్మెల్సీ తక్కల్లపల్లి రవీందర్ రావు, ఎస్ జి ఎఫ్ సెక్రటరీ ఐలయ్య చేతుల మీదుగా పదివేల రూపాయల బహుమతి మెమొంటో అందించి సన్మాన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ పాఠశాల విద్యాశాఖ మహబూబాద్ జిల్లా ఆధ్వర్యంలో ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక 2026 విద్యా వారోత్సవాలు విజయోత్సవం లో భాగంగా 10వ తరగతి మరియు ఇంటర్మీడియట్ జిల్లా టాపర్లను మరియు జాతీయస్థాయి ఆటల పోటీలలో పాల్గొన్న విద్యార్థులకు ప్రోత్సాహాలు అందించడం జరిగింది.
జడ్పిహెచ్ఎస్ ఆలేరు హై స్కూల్లో 9వ తరగతి చదువుతున్న బానోతు యశ్వంత్ ఇటీవల నిర్వహించిన జాతీయస్థాయి రబ్బీ పోటీల్లో భువనేశ్వర్ లో పాల్గొనడం జరిగింది అందుకుగాను అత్యుత్తమ ప్రతిభ కనబరిచిన బానోతు యశ్వంత్ ను గౌరవ కలెక్టర్ స్నేహ శబరిష్ మరియు ఎమ్మెల్సీ తక్కలపల్లి రవీందర్ రావు , డి ఈ ఓ సత్యనారాయణ మూర్తి , ఎంఈఓ రామదాసు , ఎస్ జి ఎఫ్ ఐ సెక్రెటరీ గండి సత్యనారాయణ , మరియు ఎస్ జి ఎఫ్ అసిస్టెంట్ సెక్రటరీ ఐలయ్య , చేతుల మీదుగా ప్రోత్సాహకంగా 10,000/- రూపాయలు నగదు బహుమతి మరియు మెమెంటో చే సన్మానం చేయడం జరిగింది. కార్యక్రమంలో విద్యార్థి తల్లిదండ్రులు బానోతు యాకు దంపతులు మరియు ఫిజికల్ డైరెక్టర్ మరియు ఉపాధ్యాయ బృందం అభినందించినట్లు తెలిపారు.



