Sunday, May 17, 2026
E-PAPER
Homeజాతీయంకాంగ్రెస్ ఆఫీసులో చోరీ

కాంగ్రెస్ ఆఫీసులో చోరీ

- Advertisement -

న‌వ‌తెలంగాణ‌-హైద‌రాబాద్: ఛత్తీస్‌గఢ్‌లోని స్థానిక కాంగ్రెస్ పార్టీ జిల్లా కార్యాలయంలో చోరీ జ‌రిగింది. అయితే దోపిడీ అనంతరం వాష్‌రూమ్‌లలో’ఐ లవ్ యూ అంబికాపూర్’ అని రాసి మరీ పరారయ్యారు దొంగ‌లు. వరుసగా మూడోసారి చొరబడిన దొంగలు.. వాష్‌రూమ్‌లలో ఉన్న దాదాపు 73 స్టీల్ నల్లాలు (Taps), ఇతర ప్లంబింగ్ ఫిట్టింగులను ఎత్తుకెళ్లారు.

నగరంలోనే అత్యంత రద్దీగా ఉండే, వీఐపీ జోన్‌గా భావించే గాంధీ చౌక్ ప్రాంతంలోని కాంగ్రెస్ ఆఫీసులో శుక్రవారం అర్ధరాత్రి ఈ ఘటన జరిగింది. శనివారం ఉదయం ఆఫీసు తెరిచిన సిబ్బంది వాష్‌రూమ్‌ల పరిస్థితి చూసి షాక్‌కు గురయ్యారు. బేసిన్లు పగిలిపోయి, ఫ్లష్ సిస్టమ్స్ ధ్వంసమై, గోడలకు ఉండాల్సిన నల్లాలు మాయమై పైపులు మాత్రమే వేలాడుతూ కనిపించాయి. కేసు న‌మోదు చేసిన పోలీసులు ద‌ర్యాప్తు ప్రారంభించారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -