Monday, May 18, 2026
E-PAPER
Homeజిల్లాలుఉపాధి పనులను సద్వినియోగం చేసుకోవాలి: ఎంపీడీఓ

ఉపాధి పనులను సద్వినియోగం చేసుకోవాలి: ఎంపీడీఓ

- Advertisement -

నవతెలంగాణ-కమ్మర్ పల్లి
జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం పనులను కూలీలు సభ్యులను చేసుకోవాలని మండల పరిషత్ అభివృద్ధి అధికారి చింత రాజ శ్రీనివాసన్ అన్నారు. సోమవారం మండలంలోని బషీరాబాద్ చెరువు వద్ద కొనసాగుతున్న పూడికతీత పనులను ఆయన పరిశీలించారు. మాస్టర్ రోల్ పరిశీలించి, కూలీల హాజరు తీసుకున్నారు.పని ప్రదేశంలో కల్పిస్తున్న మౌళిక వసతులపై ఫీల్డ్ అసిస్టెంట్ ను ఆరా తీసి పలు సూచనలు చేశారు.ఉపాధిహామీ పనులకు కూలీలు ఎక్కువ సంఖ్యలో వచ్చేలా చూడాలని సూచించారు. వేసవి కాలం అధిక ఉష్ణోగ్రతల నేపథ్యంలో ఉపాధి కూలీలు తప్పనిసరిగా ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలన్నారు.ఎండలో పనిచేసే సమయంలో తరచూ నీరు తాగడం, తలపై గుడ్డ లేదా టోపీ ధరించడం, మధ్య మధ్యలో విశ్రాంతి తీసుకోవడం, అవసరమైనప్పుడు ఓఆర్‌ఎస్‌ ద్రావణం తీసుకోవడం ద్వారా నీరసం, అలసట వంటి సమస్యలను నివారించవచ్చని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో పంచాయతీ కార్యదర్శి ప్రభాకర్, ఫీల్డ్ అసిస్టెంట్ రాజు, తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -