Monday, May 18, 2026
E-PAPER
Homeతెలంగాణ రౌండప్వరి ధాన్యం కొనుగోలు కేంద్రం పరిశీలన

వరి ధాన్యం కొనుగోలు కేంద్రం పరిశీలన

- Advertisement -

నవతెలంగాణ-కమ్మర్ పల్లి 
మండలంలోని బషీరాబాద్ గ్రామంలో ఐకేపీ ఆధ్వర్యంలో కొనసాగుతున్న వరి ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని సోమవారం మండల పరిషత్ అభివృద్ధి అధికారి చింత రాజ శ్రీనివాస్ పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన కొనుగోలు కేంద్ర నిర్వహిస్తున్న ఐకెపి మహిళలతో మాట్లాడారు. కొనుగోలు కేంద్రం  వద్ద రైతులు నిలువ ఉంచిన ధాన్యం కుప్పలను, కొనుగోలు చేసిన ధాన్యాన్ని లారీలో లోడింగ్ చేయడానికి  ఆయన పరిశీలించారు. కొనుగోలు కేంద్రాల్లో ధాన్యం నిలువలు, కాంట వివరాలను అడిగి తెలుసుకున్నారు. కొనుగోల్లలో ఎదురవుతున్న ఇబ్బందులపై రైతులతో ముచ్చటించారు. కొనుగోళ్లలో వేగం పెంచాలని, హమాలీల కొరత, లారీల కొరత లేకుండా చూసుకోవాలని సిబ్బందికి సూచించారు. కంట పూర్తయిన ధాన్యాన్ని ఎప్పటికప్పుడు నిర్దేశించిన రైస్ మిల్లులకు తరలించాలన్నారు. తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -