నవతెలంగాణ-భువనగిరి కలెక్టరేట్
ప్రభుత్వ ఆదేశాల మేరకు ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక కార్యక్రమాల నేపథ్యంలో పర్యాటకశాఖ కార్యాచరణ ప్రణాళికలో భాగంగా సోమవారం కలెక్టరెట్ లోని సమావేశ మందిరంలో లో99 రోజుల కార్యచరణ ప్రణాళికను, యువ టూరిజం క్లబ్స్ కార్యచరణ పైన రూపొందించిన పోస్టర్ ను జిల్లా కలెక్టర్ అనురాగ్ జయంతి, రెవెన్యూ అదనపు కలెక్టర్ వెంకా రెడ్డి, స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ భాస్కర్ రావు తో కలసి ఆవిష్కరించారు.
ఈ సందర్బంగా కలెక్టర్ మాట్లాడుతూ ప్రజా పాలన – ప్రగతి ప్రణాళిక’ 99 రోజుల కార్యక్రమంలో భాగంగామే 18 నుండి 23 వరకు పర్యాటక వారోత్సవాలను నిర్వహిస్తోందన్నారు. కార్యక్రమం లో జెడ్పి సీఈఓ శోభారాణి, జిల్లా గ్రామీణాభివృద్ధి అధికారి నాగిరెడ్డి, జిల్లా యువజన, క్రీడల శాఖ అధికారి ధనంజనేయులు, డి పి ఆర్ ఓ అరుంథతి, హోసింగ్ పీడీ అలివేలు , సంబంధిత అధికారులు పాల్గొన్నారు.



