Monday, May 18, 2026
E-PAPER
Homeఖమ్మంగ్రామీణ వైద్యులపై దాడులు ఆపాలి

గ్రామీణ వైద్యులపై దాడులు ఆపాలి

- Advertisement -

– ఎమ్మెల్యే జారే ఆదినారాయణ కు వినతిపత్రం
నవతెలంగా – అశ్వారావుపేట

జిల్లా వ్యాప్తంగా డీఎం అండ్ హెచ్ఓ,ఇతర జిల్లా స్థాయి వైద్యాధికారులు గ్రామీణ వైద్యుల క్లినిక్‌ ల పై నిర్వహిస్తున్న దాడులు, తనిఖీలు నిలిపివేయాలని అశ్వారావుపేట మండల ఆర్ఎంపీ వెల్ఫేర్ అసోసియేషన్ డిమాండ్ చేసింది. ఈ మేరకు సోమవారం అశ్వారావుపేట ఎమ్మెల్యే జారే ఆదినారాయణ కు సంఘం నాయకులు వినతిపత్రం అందజేశారు. గ్రామీణ ప్రాంతాల్లో పేద ప్రజలకు ప్రాథమిక వైద్య సేవలు అందిస్తున్న ఆర్ఎంపీ ల మనుగడ కొనసాగేలా చర్యలు తీసుకోవాలని కోరారు. కార్యక్రమంలో సంఘం మండల అధ్యక్షుడు బాబా, వైస్ ప్రెసిడెంట్ తాతారావు, ట్రెజరర్ వేల్పుల సత్యనారాయణ, జాయింట్ సెక్రటరీ అజీజ్, అజ్మీర్ వెంకటేశ్వరావు తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -