Monday, May 18, 2026
E-PAPER
Homeతెలంగాణ రౌండప్మోడీ హయాంలో మళ్ళీ సైకిల్ పై ప్రయాణించే దుస్థితి

మోడీ హయాంలో మళ్ళీ సైకిల్ పై ప్రయాణించే దుస్థితి

- Advertisement -

రాష్ట్ర ప్రభుత్వ విప్, ఎమ్మెల్యే బీర్ల అయిలయ్య
నవతెలంగాణ-ఆలేరు టౌను

కేంద్ర ప్రభుత్వం డీజిల్, పెట్రోల్ ధరలు పెంచడంతో సామాన్య ప్రజలు మళ్ళీ సైకిళ్లపై ప్రయాణించాల్సిన పరిస్థితి నెలకొందని రాష్ట్ర ప్రభుత్వ విప్, ఆలేరు ఎమ్మెల్యే బీర్ల ఐలయ్య అన్నారు. ఆలేరు పట్టణంలో సోమవారం జాతీయ రహదారిపై, పట్టణంలోని మెయిన్ రోడ్డు మీదుగా వ్యవసాయ మార్కెట్ వరకు సైకిల్ పై స్థానిక నాయకులతో కలిసి ప్రయాణించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ .. పెట్రోల్, డీజిల్ ధరలు రోజురోజుకు పెరుగుతుండటంతో పేద మరియు సామాన్య ప్రజలపై తీవ్ర భారం పడుతోందని ఆవేదన వ్యక్తం చేశారు. 

మోడీ ప్రభుత్వ హయాంలో సామాన్య ప్రజలు మళ్లీ సైకిళ్లపై ప్రయాణించాల్సిన దుస్తితి వచ్చిందని విమర్శించారు. వ్యవసాయ మార్కెట్లో ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని సందర్శించి వడ్ల కొనుగోలు ప్రక్రియను పరిశీలించారు. రైతులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా, ధాన్యం కొనుగోలు పారదర్శకంగా మరియు వేగవంతంగా జరిగేలా అధికారులు ప్రత్యేక చర్యలు తీసుకోవాలని సూచించారు. రైతులు పండించిన ప్రతి గింజకు సరైన ధర అందేలా ప్రభుత్వం కట్టుబడి ఉందని, కొనుగోలు కేంద్రాల్లో లారీలు, తూకం, హమాలీలు వంటి సౌకర్యాలు సమయానికి అందుబాటులో ఉంచాలని అధికారులను ఆదేశించారు. రైతులకు ఇబ్బందులు కలిగితే సంబంధిత అధికారులపై చర్యలు తప్పవని హెచ్చరించారు.

 ఈ కార్యక్రమంలో సీఐ యాలాద్రి  ఎస్ఐ ఎన్ వినయ్ ,కాంగ్రెస్ పార్టీ నాయకులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -