నవతెలంగాణ – హైదరాబాద్ : పిల్లల కోసం స్థిరమైన దుస్తులు మరియు జీవనశైలి బ్రాండ్ అయిన ఎడ్-ఎ-మమ్మా, హైదరాబాదు, శరత్ సిటీ క్యాపిటల్ మాల్ లో తన రెండవ ప్రత్యేక బ్రాండ్ అవుట్లెట్ (ఈబిఓ) ను ప్రారంభించింది. ఈ ప్రారంభము ప్రధాన మార్కెట్లలో బ్రాండ్ యొక్క విస్తరణను మరియు అధిక-వృద్ధి సామర్థ్యం ఉన్న పట్టణాలపై దృష్టితో దక్షిణ భారతదేశములో తన ఉనికిని బలోపేతం చేయడాన్ని సూచిస్తుంది.
వ్యవస్థాపకురాలు మరియు నటి అయిన ఆలియా భట్ స్థాపించిన ఎడ్-ఎ-మమ్మా, కుటుంబాలను జీవనశైలి బ్రాండ్ గా ఆవిర్భవించింది. ఒక స్థిరమైన పిల్లల దుస్తుల రకముగా ప్రారంభం అయి, మెటర్నిటీ వేర్, బొమ్మలు, పుస్తకాలు, యాక్సెసరీలు మరియు ఇటీవల శిశు సంరక్షణ ఉత్పత్తులు ఉన్న ఒక విస్తృతమైన ఎకోవ్యవస్థగా అభివృద్ధి చెందింది. ప్రతి ఒక్కటి చిన్నవయసు నుండే ఆలోచనాత్మక జీవనశైలిని ప్రోత్సహించే ప్రకృతి-ప్రాధాన్యత కలిగిన ఫిలాసఫీలో మూలాలు కలిగి ఉంది.
హైదరాబాదు దుకాణము బ్రాండ్ వ్యూహానికి మద్దతును అందిస్తూ వినియోగదారులకు లభ్యతను పెంచుతుంది. ఆవిష్కరణను ప్రోత్సహించడం, ప్రమేయం మరియు భౌతిక మరియు డిజిటల్ ప్లాట్ఫార్మ్స్ రెండిటిలో మళ్ళీ మళ్ళీ కొనుగోళ్ళు చేయడములో ఆఫ్లైన్ రీటెయిల్ ప్రధాన పాత్ర పోషిస్తుంది. లేక్షోర్ మాల్ Y జంక్షన్ వద్ద నగరములో ఇప్పటికే ఒక దుకాణము ఉండగా, ఈ రెండవ దుకాణము ఎడ్-ఎ-మమ్మా యొక్క ఉనికిని బలోపేతం చేస్తుంది మరియు హైదరాబాదు యొక్క పెరుగుతున్న వినియోగదారుల బేస్ తో తన అనుబంధాన్ని దృఢపరుస్తుంది. సహజంగా తీసుకోబడిన మెటీరియల్స్ తో మరియు సున్నితమైన డిజైన్ తో, ఎడ్-ఎ-మమ్మా సురక్షితమైన, ఆలోచనాత్మకమైన మరియు పర్యావరణానుకూలమైన ఉత్పత్తులను తయారు చేస్తుంది.
శరత్ సిటీ క్యాపిటల్ మాల్ లో రెండవ అంతస్తులో ఉన్న ఈ 971 చ. అ. దుకాణము ప్రత్యేకమైన బ్రాండ్ అవుట్లెట్ (ఈబిఓ) ఫార్మాట్ ను అనుసరిస్తుంది. వెచ్చనైన, ఆహ్వానించదగిన ప్రదేశముగా రూపొందించబడిన ఈ దుకాణము, ఎడ్-ఎ-మమ్మా యొక్క ప్రకృతి-ప్రేరేపిత అందాన్ని ప్రతిబింబిస్తుంది. సహజమైన ఆకృతులు, మృదువైన విజువల్ అంశాలు మరియు కథనం-ఆధారిత ప్రదర్శనలు అన్నీ కలిసి పిల్లలు స్వేచ్ఛగా పరిశీలించగలిగే, తల్లిదండ్రులు బ్రాండ్ ఆఫరింగ్స్ ను తెలుసుకోగలిగే ఒక వాతావరణాన్ని సృష్టిస్తాయి.
దుకాణము ప్రారంభం గురించి వ్యాఖ్యానిస్తూ, ఆలియా భట్, వ్యవస్థాపకురాలు, ఎడ్-ఎ-మమ్మా, ఇలా అన్నారు, “హైదరాబాదు మా ప్రయాణములో ముఖ్యమైన భాగంగా నిలిచింది. ఇక్కడ మాకు లభించిన ప్రేమ, ఆదరణలు చూసిన తరువాత, ఈ రెండవ దుకాణం మరింత అర్థవంతం అయింది. ప్రతి కొత్త ప్రదేశముతో, మేము కేవలం ఒక దుకాణాన్ని మాత్రమే ప్రారంభించడం లేదు. మేము కుటుంబాలు ఎడ్-ఎ-మమ్మా ను మరియు దాని ఉద్దేశాలను అనుభవపూర్వకంగా తెలుసుకుంటారు. మా దృష్టి ఎప్పుడు పిల్లలకు మరియు గ్రహానికి అనుకూలంగా ఉండే ఉత్పత్తులను తయారు చేయడంపై ఉంది మరియు ఇక్కడ ప్రతిస్పందన మాకు ఎంతో ప్రోత్సాహకరంగా ఉంది. హైదరాబాదులో మా కమ్యూనిటీ వృద్ధి చెందుతున్నందుకు మేము చాలా సంతోషిస్తున్నాము.”
ఈ దుకాణము, 0-14 సంవత్సరాల వయసు పిల్లల కొరకు నేచురల్ ఫ్యాబ్రిక్స్ నుండి తయారుచేయబడిన దుస్తులు, మెటర్నిటీ వేర్, బొమ్మలు, పుస్తకాలు, జీవనశైలి యాక్సెసరీలు మరియు కొత్తగా ప్రవేశపెట్టబడిన పరిశుభ్రమైన పిల్లల సంరక్షణ శ్రేణి సహా ఎడ్-ఎ-మమ్మా యొక్క పెరుగుతున్న ఉత్పత్తి ప్రపంచము యొక్క సమగ్ర అవలోకాన్ని ఇస్తుంది. ఆవశ్యక వర్గాలను అన్నిటిని ఒకే పైకప్పు కిందికి తీసుకొస్తూ, ఈ ఫార్మాట్ వలన కుటుంబాలు ఆలోచించి ఎంచుకునే అవకాశం ఇస్తుంది.
తన దీర్ఘ-కాలిక వృద్ధి పథములో భాగంగా, ఎడ్-ఎ-మమ్మా కీలక మార్కెట్లలో తన రీటెయిల్ ఉనికి విస్తరణను కొనసాగిస్తుంది. వర్గాలు మరియు భూభాగాలలో పెరుగుతున్న ఉనికితో, భారతదేశవ్యాప్తంగా కుటుంబాల కొరకు ఈ బ్రాండ్ స్థిరంగా తన స్థానాన్ని ఒక విశ్వసనీయమైన, ఉద్దేశ-ఆధారిత స్థిరమైన జీవనశైలి బ్రాండ్ గా బలోపేతం చేసుకుంటుంది.


