
నవతెలంగాణ- రామారెడ్డి: అధికార పార్టీ గత పది సంవత్సరాల పరిపాలనపై ప్రజలు వ్యతిరేకిస్తూ, మార్పును కోరుకుంటున్నారని సోమవారం జిల్లా పరిషత్ ఫ్లోర్ లీడర్ నా రెడ్డి మోహన్ రెడ్డి అన్నారు. మండలంలోని రెడ్డి పేటలో ఇంటింటి ప్రచారాన్ని స్థానిక కాంగ్రెస్ శ్రేణులతో కలిసి ప్రచారం చేశారు. కాంగ్రెస్ ఆర్ గ్యారంటీలను, గతంలో చేసిన అభివృద్ధిని వివరిస్తూ, హస్తం గుర్తుకు ఓటు వేసి, కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి గెలుపుకు కృషి చేయాలని సూచించారు. కార్యక్రమంలో నాయకులు ధన్సింగ్, నాయిని నర్సింలు, కుమ్మరి శంకర్, రాజయ్య, ఇర్షాద్, బాలయ్య, ఫారుక్, తదితరులు పాల్గొన్నారు