Tuesday, May 19, 2026
E-PAPER
Homeట్రెండింగ్ న్యూస్కాటారం వ్యవసాయ మార్కెట్ అభివృద్ధికి కీలక నిర్ణయాలు

కాటారం వ్యవసాయ మార్కెట్ అభివృద్ధికి కీలక నిర్ణయాలు

- Advertisement -

సర్వసభ్య సమావేశంలో పలు తీర్మానాలు}
నవతెలంగాణ – కాటారం:-
వ్యవసాయ మార్కెట్ కార్యాలయంలో  సోమవారం  మార్కెట్ చైర్‌పర్సన్ పంతకాని తిరుమల అధ్యక్షతన సర్వసభ్య సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో వైస్ చైర్మన్, డైరెక్టర్లు పాల్గొని మార్కెట్ అభివృద్ధి, రైతులకు మెరుగైన మౌలిక సదుపాయాల కల్పనపై పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు.

మార్కెట్ యార్డు ప్రహరీ గోడ నిర్మాణానికి రూ.1 కోటి నిధులు మంజూరు చేయించిన రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు కు  కృతజ్ఞతలు తెలియ చేశారు. అనంతరం సభ్యులు తహసీల్దార్ కార్యాలయానికి వెళ్లి మార్కెట్ యార్డుకు సంబంధించిన 12 ఎకరాల 9 గుంటల స్థలాన్ని సర్వే చేసి సరిహద్దులు చూపించాలని రెవెన్యూ అధికారులను కోరారు. సర్వే పూర్తయ్యిన వెంటనే ప్రహరీ గోడ నిర్మాణ పనులు ప్రారంభించనున్నట్లు తెలిపారు.

రాబోయే రోజుల్లో మార్కెట్ ప్రాంగణంలో కోల్డ్ స్టోరేజ్, గోదాములు, సీసీ ప్లాట్‌ఫాంల నిర్మాణంతో పాటు రైతులకు ఉపయోగపడే మరిన్ని అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టాలని సమావేశంలో తీర్మానించారు.

ఈ సమావేశంలో వైస్ చైర్మన్ బ్రహ్మారెడ్డి, డైరెక్టర్లు తిరుపతిరావు, శ్రీనివాస్, పిల్లమారి రమేష్, చడవలి రాజయ్య, రాజారాం, రామకృష్ణ, శ్రీనివాస్ రెడ్డి, ఇర్షాద్, సెక్రటరీ లా షరీఫ్ తదితరులు పాల్గొన్నారు

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -