Tuesday, May 19, 2026
E-PAPER
Homeఆటలుజీవన్‌‌రెడ్డి ఎన్నిక అక్రమం!

జీవన్‌‌రెడ్డి ఎన్నిక అక్రమం!

- Advertisement -

టీఏసీ కార్యదర్శి గురువారెడ్డి తీవ్ర ఆరోపణ
హెచ్‌‌సీఏ అపెక్స్‌ కౌన్సిల్‌ రద్దుకు డిమాండ్‌

నవతెలంగాణ-హైదరాబాద్‌ :హైదరాబాద్‌ ‌క్రికెట్‌ అసోసియేషన్‌ (‌హెచ్‌‌సీఏ) కార్యదర్శిగా ఎన్నికైన మన్నె జీవన్‌‌రెడ్డి ఎన్నిక చట్ట విరుద్ధమని, అది చెల్లదని తెలంగాణ క్రికెట్‌ అసోసియేషన్‌ (‌టీసీఏ) కార్యదర్శి ధరమ్‌ గురువారెడ్డి ఆరోపించారు. ‘ఆక్స్‌‌ఫర్డ్‌ ‌బ్లూస్‌ ‌క్రికెట్‌ ‌క్లబ్‌‌లో 2025 నవంబర్‌ 6‌న ఆఫీస్‌‌బేరర్‌‌గా జీవన్‌‌రెడ్డి చేరారు. 4 నెలల కాలంలోనే హెచ్‌‌సీఏ కార్యదర్శిగా ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. కానీ, ఆక్స్‌‌ఫర్డ్‌ ‌బ్లూస్‌ ‌క్రికెట్‌ ‌క్లబ్‌ ‌పేరుతో రంగారెడ్డి జిల్లా రిజిస్టార్‌ ‌కార్యాలయంలో పాటు హైదరాబాద్‌ జిల్లా రిజిస్టార్‌ ‌కార్యాలయంలో విడివిడిగా సోసైటీలు నమోదయ్యాయి. గతంలో జస్టిస్‌‌ లావు నాగేశ్వర్‌‌రావు కమిటీ సమగ్ర ఆడిట్ నివేదికలో గుర్తించిన సోసైటీ ఓ జిల్లాలో ఉండగా.. ప్రస్తుతం జీవన్‌‌రెడ్డి ప్రాతినిథ్యం వహిస్తున్న సోసైటీ మరో జిల్లాలో ఉంది. క్రికెట్‌ ‌క్లబ్‌ ‌యాజమాన్య బదిలీ సహా సోసైటీ రిజిస్టార్‌ ‌కార్యాలయం మార్పు అంశాలను హెచ్‌‌సీఏ వార్షిక సర్వ సభ్య సమావేశం ఆమోదించాలి. అవేవీ లేకుండానే, జీవన్‌‌రెడ్డి ఎన్నికల్లో పోటీ చేశారు. అక్రమంగా ఎన్నికయ్యారు. తక్ష‍ణమే జీవన్‌ ‌రెడ్డి ఎన్నికను రద్దు చేయటంతో పాటు అపెక్స్‌ ‌కౌన్సిల్‌‌ స్థానంలో బీసీసీఐ స్వయంగా బాధ్యతలు తీసుకోవాలని’ గురువారెడ్డి డిమాండ్‌ ‌చేశారు. అంబటి రాయుడు క్రికెట్‌ ఆపరేషన్స్‌ ‌డైరెక్టర్‌గా నియామకం, సెలక్ష‍న్‌ ‌కమిటీల ఏర్పాటు సైతం రూల్స్‌‌కు విరుద్ధంగా జరిగాయని.. తన స్నేహితులను రాయుడు సెలక్ష‍న్‌ ‌కమిటీలోకి తీసుకోవటం విరుద్ధ ప్రయోజనాలకు తావిస్తుందని గురువారెడ్డి విమర్శించారు. టీజీ20 లీగ్‌ ‌పేరుతో హెచ్‌‌సీఏ క్రికెట్‌‌ను కార్టెల్‌‌గా మార్చేందుకు ప్రయత్నం చేస్తుందని, అనర్హులని గవర్నింగ్‌ ‌కౌన్సిల్‌ ‌సభ్యులుగా ఎంపిక చేయటంతో పాటు జిల్లాల్లో అడుగుపెట్టాలని చూడటంపై టీసీఏ చూస్తూ ఊరుకోదని గురువారెడ్డి హెచ్చరించారు. విలేకరుల సమావేశంలో గోపాల్‌ ‌శర్మ, వరుణ్‌, చిత్తరంజన్‌ ‌తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -