Tuesday, May 19, 2026
E-PAPER
Homeఆటలుక్రీడా వారోత్సవాలు ఆరంభం

క్రీడా వారోత్సవాలు ఆరంభం

- Advertisement -

మంత్రులు వాకిటి శ్రీహరి, పొన్నం ప్రభాకర్‌ హాజరు
నవతెలంగాణ-హైదరాబాద్‌ :రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ప్రజా పాలన ప్రగతి ప్రణాళిక 99 రోజుల కార్యక్రమంలో భాగంగా క్రీడా మంత్రత్వి శాఖ ‘యువజన క్రీడా వారోత్సవాలు’ సోమవారం ఘనంగా ఆరంభం అయ్యాయి. సోమవారం నుంచి శనివారం వరకు రాష్ట్ర వ్యాప్తంగా జిల్లా, మండల కేంద్రాల్లో ‘యూత్ అండ్‌ ‌స్పోర్ట్స్‌ ‌వీక్‌’ను నిర్వహించనున్నారు. సోమవారం ఎల్బీ స్టేడియంలో జరిగిన కార్యక్రమంలో క్రీడాశాఖ మంత్రి వాకిటి శ్రీహరి, బీసీ సంక్ష‍ేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్‌, క్రీడా ప్రాధికార సంస్థ చైర్మెన్‌ ‌కె. శివసేనా రెడ్డి, తెలంగాణ ఒలింపిక్‌ అసోసియేషన్‌ అధ్యక్ష‍ుడు ఏపీ జితేందర్‌ ‌రెడ్డి, శాట్జ్‌ ఎండీ సోనీబాలా దేవి తదితరులు క్రీడా వారోత్సవాలను అధికారికంగా ప్రారంభించారు. ‘ క్రీడలు శారీరక, మానసిక ధృడత్వంతో పాటు నాయత్వ లక్ష‍ణాలు, జట్టుతత్వం, క్రమశిక్ష‍ణ పెంపొందిస్తాయి. యువతకు మత్తుకు దూరమై మైదానాలకు చేరువ కావాలని’ వాకిటి శ్రీహరి అన్నారు. క్రీడా వారోత్సవాల్లో భాగంగా ఎల్బీ స్టేడియంలో జుంబా, వాకథాన్‌, యోగా, మెడిటేషన్‌ ‌సెషన్లు నిర్వహించనున్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -