- Advertisement -
నవతెలంగాణ – హైదరాబాద్ : అర్జెంటీనా ఫుట్‌బాల్ దిగ్గజం లియోనెల్ మెస్సీ అంతర్జాతీయ కెరీర్‌కు తెరపడింది. ఫిఫా ప్రపంచకప్ 2026 ఫైనల్‌లో స్పెయిన్ చేతిలో అర్జెంటీనా ఓటమితో మెస్సీ జాతీయ జట్టుకు వీడ్కోలు పలికాడు. చివరి మ్యాచ్‌లో ట్రోఫీతో ముగించాలని ఆశించినా అది నెరవేరకపోవడంతో భావోద్వేగానికి గురయ్యాడు. 2016లో రిటైర్మెంట్ ప్రకటించినా, అభిమానుల విజ్ఞప్తితో తిరిగి వచ్చి 2021, 2024 కోపా అమెరికా టైటిళ్లు, 2022 ప్రపంచకప్‌ను అర్జెంటీనాకు అందించాడు. అనేక చారిత్రక విజయాలతో అంతర్జాతీయ ఫుట్‌బాల్‌లో చిరస్మరణీయ వారసత్వాన్ని విడిచిపెట్టి తన ప్రస్థానాన్ని ముగించాడు.
- Advertisement -



