- Advertisement -
నవతెలంగాణ – హైదరాబాద్ : అయోధ్య రామాలయ విరాళాల చోరీ కేసుకు సంబంధించి నేడు (సోమవారం) సుప్రీంకోర్టులో కీలక విచారణ జరగనుంది. ఈ కేసుపై దర్యాప్తు చేపట్టిన ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్) ఇప్పటికే తన స్టేటస్ రిపోర్టును సీల్డ్ కవర్‌లో ధర్మాసనానికి సమర్పించింది. ఆ నివేదికను పరిశీలిస్తూ తదుపరి చర్యలపై సుప్రీంకోర్టు విచారణ చేపట్టనుంది. ఈ కేసులో గతంలో రామాలయ ట్రస్ట్, కేంద్ర ప్రభుత్వం, ఉత్తర్‌ప్రదేశ్ ప్రభుత్వాలకు నోటీసులు జారీ చేసిన ధర్మాసనం, దర్యాప్తును సీబీఐకి అప్పగించాలని కోరుతూ దాఖలైన పలు పిటిషన్లను కూడా పరిశీలించనుంది.
- Advertisement -


