Sunday, September 20, 2026
E-PAPER
Homeఆటలుముగిసిన రాష్ర్ట స్థాయి స్విమ్మింగ్‌ పోటీలు

ముగిసిన రాష్ర్ట స్థాయి స్విమ్మింగ్‌ పోటీలు

- Advertisement -

ఓవరాల్‌ చాంపియన్‌గా మేడ్చల్‌ మల్కాజ్‌గిరి
నవతెలంగాణ-హైదరాబాద్‌ :

మూడు రోజుల పాటు ఉత్సాహంగా సాగిన 11వ సబ్‌ జూనియర్‌, జూనియర్‌ అంతర్‌జిల్లా స్విమ్మింగ్‌ పోటీలు సోమవారం ఘనంగా ముగిశాయి. 54 పసిడి పతకాలు, 50 రజత పతకాలు, 26 కాంస్య పతకాలు సాధించిన మేడ్చల్‌ మల్కాజ్‌గిరి రాష్ర్ట స్థాయిలో ఓవరాల్‌గా చాంపియన్‌గా నిలిచింది. మేడ్చల్‌ మల్కాజ్‌గిరి 472 పాయింట్లతో అగ్రస్థానంలో నిలిచింది. 293 పాయింట్లతో రంగారెడ్డి జిల్లా ద్వితీయ స్థానంలో నిలువగా.. ఆ జిల్లా స్విమ్మర్లు 34 పసిడి, 25 సిల్వర్‌, 24 కాంస్య పతకాలు కొల్లగొట్టారు.
స్విమ్మింగ్ పోటీల్లో విజేతలకు నిలిచిన క్రీడాకారులకు, ఓవరాల్‌ చాంపియన్‌షిప్స్‌లో ప్రథమ, ద్వితీయ స్థానంలో నిలిచిన జిల్లాలకు తెలంగాణ స్విమ్మింగ్‌ సంఘం అధ్యక్షుడు చంద్రశేఖర్‌ రెడ్డి, కార్యదర్శి జి ఉమేశ్‌లు బహుమతులు ప్రదానం చేశారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -