నవతెలంగాణ-తుంగతుర్తి
యాదవ కులస్తులు అత్యంత భక్తిశ్రద్ధలతో జరుపుకునే సాంస్కృతిక,ఆధ్యాత్మిక వేడుకల్లో సౌనమ్మ ఉత్సవం ఒకటని,సౌనమ్మ తల్లిని గ్రామదేవతగా,శక్తి స్వరూపిణిగా భావించి యాదవులు మొక్కులు తీర్చుకుంటారని,తుంగతుర్తి మాజీ శాసనసభ్యులు డాక్టర్ గాదరి కిషోర్ కుమార్ అన్నారు.మంగళవారం మండల పరిధిలోని అన్నారం గ్రామంలో నిర్వహిస్తున్న సౌనమ్మ తల్లి వేడుకలకు హాజరై అమ్మవారికి మొక్కులు చెల్లించి మాట్లాడారు.ఈ మేరకు అమ్మవారి ఆశీస్సులతో గ్రామ ప్రజలు సుభిక్షంగా ఉండాలని,పంటలు బాగా పండాలని,పశుసంపద వృద్ధి చెందాలని ఆకాంక్షించారు.ఈ మేరకు వారిని సాంప్రదాయ వాయిద్యాల నడుమ,కోలాటాలతో ఆహ్వానించి ఘనంగా సన్మానించారు.అనంతరం యాదవ సోదరులతో కలిసి యాదవ సాంప్రదాయ కటార్లతో విన్యాసాలు చేసి, బేరీలు మోగించారు. ఈ కార్యక్రమంలో వారి వెంట స్థానిక సర్పంచ్ కుంచాల శ్రీనివాస్ రెడ్డి,మండల పార్టీ అధ్యక్షులు తాటికొండ సీతయ్య,మాజీ వైస్ ఎంపీపీలు దొంగరి శ్రీనివాస్,మట్టపల్లి శ్రీశైలం యాదవ్,పోగుల రామకృష్ణారెడ్డి,చంద్రశేఖర్,వీరారెడ్డి,యాదవ సోదరులు,తదితరులు పాల్గొన్నారు.
సౌనమ్మ వేడుకలలో పాల్గొన్న మాజీ ఎమ్మెల్యే గాదరి
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES



