- Advertisement -
నవతెలంగాణ – హైదరాబాద్ : ఉత్తరాఖండ్ మాజీ ముఖ్యమంత్రి, రిటైర్డ్ మేజర్ జనరల్ భువన్ చంద్ర ఖండూరి (91) మంగళవారం అనారోగ్యంతో కన్నుమూశారు. డెహ్రడూన్‌లోని మ్యాక్స్ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచిన ఆయన మరణంపై ప్రజలు, నేతలు తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేస్తున్నారు. ముఖ్యమంత్రి పుష్కర్ సింగ్ ధామి ఆయన సేవలను స్మరించుకుంటూ, ఆయన లేని లోటు భర్తీ చేయలేనిదని, భారత రాజకీయాల్లో, ఆర్మీలో ఆయన ఎనలేని సేవలు అందించారని తెలిపారు. ప్రభుత్వం తరఫున ఆయన స్మృతిలో కార్యక్రమాలు చేపడతామని, ఆయన ఆత్మశాంతికి ప్రార్థిస్తున్నట్లు ధామి పేర్కొన్నారు.
- Advertisement -



