ఆందోళన అవసరం లేదు..
జిల్లా డ్రగ్ ఇన్స్పెక్టర్ విశ్వనాథ్ రెడ్డ
నవతెలంగాణ-అచ్చంపేట
ఆన్లైన్లో మెడిసిన్ అమ్మకాలు రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ.. ఆల్ ఇండియా ఆర్గనైజేషన్ ఆఫ్ కెమిస్ట్స్ అండ్ డ్రగ్గిస్ట్ వారు మే 20న మెడికల్ స్టోర్లు బందుకు పిలుపునిచ్చారు. దీంతో జిల్లా డ్రగ్ ఇన్స్పెక్టర్ విశ్వనాథ్ రెడ్డి జిల్లాలో ప్రజలకు మందుల లభ్యతలో ఎటువంటి అంతరాయం కలగకుండా జిల్లా డ్రగ్స్ ఇన్‌స్పెక్టర్ గారు కెమిస్ట్స్ & డ్రగ్గిస్ట్స్ ప్రతినిధులతో చర్చించారు.
ప్రజలకు అత్యవసర వైద్య అవసరాలు మరియు ప్రజారోగ్య అవసరాలను దృష్టిలో ఉంచుకుని కల్వకుర్తి, అచ్చంపేట, నాగర్‌కర్నూల్, కొల్లాపూర్ పట్టణాల్లో కనీసం 3 మెడికల్ షాపులు చొప్పున బంద్ రోజున కూడా అందుబాటులో ఉండాలని సూచించారు. అదేవిధంగా, ఆసుపత్రులకు అనుబంధంగా ఉన్న ఫార్మసీలు యథావిధిగా కొనసాగుతాయని, ప్రజారోగ్య అవసరాలను దృష్టిలో ఉంచుకుని వారు బంద్‌లో పాల్గొనడం లేదని తెలియజేశారు. అలాగే ప్రభుత్వ ఆసుపత్రి ఆవరణలో ఉన్న జీవన్ ధారా జనరిక్ మెడికల్ షాపులు కూడా బంద్ రోజున ప్రజలకు అందుబాటులో ఉండనున్నట్లు తెలిపారు. జిల్లా డ్రగ్స్ ఇన్‌స్పెక్టర్ మెడ్‌ప్లస్, అపోలో వంటి రిటైల్ ఫార్మసీ ప్రతినిధులతో సంప్రదించారు బంద్ రోజున తమ సేవలను కొనసాగిస్తారని, ప్రజలకు మందుల లభ్యతలో ఎటువంటి ఇబ్బందులు కలగకుండా ప్రతి ప్రాంతం/పట్టణంలో కనీసం ఒక మెడికల్ షాప్ అందుబాటులో ఉండేలా చర్యలు తీసుకుంటామని తెలియజేశారు.
ప్రజలు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని, అత్యవసర వైద్య అవసరాల కోసం మెడికల్ సేవలు అందుబాటులో ఉంటాయని జిల్లా డ్రగ్స్ కంట్రోల్ అడ్మినిస్ట్రేషన్ ప్రకటించింది. మందుల లభ్యతకు సంబంధించిన సమాచారం కొరకు లేదా అత్యవసర వైద్య అవసరాల సందర్భంలో బంద్ రోజున ప్రజలు క్రింది మొబైల్ నంబర్ ద్వారా జిల్లా డ్రగ్స్ ఇన్‌స్పెక్టర్‌ను : 8333818147 సంప్రదించాలని సూచించారు.



